jio ప్రైమ్ మెంబర్షిప్ లో 50 మిలియన్ చందాదారులు
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 50 మిలియన్ చందాదారులు ను ప్రైమ్ మెంబర్షిప్ లో జతచేసుకుంది. మొదట jio ప్రమోషనల్ ఆఫర్స్ ద్వారాగా 100 మిలియన్ యూజర్స్ ని యాడ్ చేసుకుంది. ఇప్పుడు కొత్తగా . ఈ ప్రైమ్ మెంబర్షిప్ లో 50 మిలియన్ యూజర్స్ ని యాడ్ చేసుకుని సంచలనం సృష్టిస్తోంది.
కంపెనీ చెప్తున్న ప్రకారం మంగళవారం వరకు jio ప్రైమ్ సభ్యత్వాన్ని 50మిలియన్ యూజర్స్ పొందారు . మీకు తెలిసినట్లుగా రిలయన్స్ jio యొక్క హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 31మార్చ్ తో ముగుస్తోంది. ఈ మార్చ్ నెల మొదట్లోనే కంపెనీ తన ఉచిత సేవలు కంటిన్యూ చేయుటకు ప్రైమ్ ఆఫర్ ను ప్రవేశ పెట్టింది. . ఈ స్కీమ్ క్రింద 99 రూపాయలలో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ తదుపరి ప్రతి నెలా 303 రూపాయలు రీఛార్జి చేయుట ద్వారా మీరు అన్లిమిటెడ్ కాల్స్ మరియు 4G డేటా ను ఉపయోగించుకోవచ్చు. ఇవే కాకుండా యూజర్ మిగతా డేటా ప్యాక్స్ ను కూడా ఎంచుకోవచ్చు. . డేటా పాక్స్ యొక్క ప్రారంభ ధరలు 149 రూ తో మొదలయ్యాయి. .కంపెనీ చెప్తున్న ప్రకారం ప్రతి రోజూ లక్షల మంది ప్రజలు jio ప్రైమ్ మెంబర్షిప్ ను పొందుతున్నారు. ఇంకా మరికొంతమంది ఇందులో సభ్యత్వం పొందనున్నారని కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. jio 5 డిసెంబర్ లో తన సర్వీసెస్ ను ప్రారంభించింది . ఆ తరువాత jio అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వంటి ఆఫర్ ను ఇచ్చింది . రిలయన్స్ jio ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్స్ వల్ల టెలికాం కంపెనీలన్నీ దెబ్బకి దిగి వచ్చాయి. ఇక ఆఫర్స్ మీద ఆఫర్స్ కురిపించాయి.
మిగతా టెలికాం కంపెనీలన్నీ jio ఫై ట్రాయ్ కి కంప్లెయింట్ చేయటం వలనో లేక మరేఇతర కారణాలవలనో కానీ jio ఫ్రీ ఆఫర్స్ అన్ని ఈ రోజుతో ముగియనున్నాయి . కానీ యూజర్స్ అందరూ బాధపడకుండా jio ప్రైమ్ మెంబర్షిప్ పొంది లాభాలను పొందవచ్చు. ముందుగా 99 రూ చెల్లించి ఆ తరువాత ప్రతినెలా 303 రూ లతో రీఛార్జి చేసుకోవాలిసి ఉంటుంది.
దేనితో అన్లిమిటెడ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ 4G డేటా లాభాలను పొందవచ్చు. .
భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి
Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి