రిలయన్స్ జియో 2018 మొదటి త్రైమాసికంలో తన నెట్వర్క్ కు 28.7 మిలియన్ కొత్త చందాదారులను జోడించింది

Updated on 31-Jul-2018
HIGHLIGHTS

ఈ ఏడాది జూన్ చివరినాటికి రిలయన్స్ జీయో తన నెట్వర్క్లో మొత్తం 215.3 మిలియన్ల మంది చందాదారులను జత చేసింది.

రిలయన్స్ జియో ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దాని పనితీరు గురించి వివరాలను విడుదల చేసింది మరియు టెలికాం ఆపరేటర్ కోసం విషయ గణన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కంపెనీ తెలిపిన ప్రకారంగా ,తన నెట్వర్క్ కు 28.7 మిలియన్ కొత్త చందాదారులను జోడించినట్లు తెలుస్తోంది . అంటే దీని అర్ధం ఈ ఏడాది జూన్ చివరినాటికి రిలయన్స్ జీయో తన నెట్వర్క్లో మొత్తం 215.3 మిలియన్ల మంది చందాదారులను జత చేసింది.

కంపనీ యొక్క రెవెన్యూ కూడా రూ 8,109 కోట్లు గా ఉన్నట్లు పేర్కొన్నారు , ఇది QoQ యొక్క 13.8 వృద్ధి రేట్ గా ఉందని కంపనీ తెలిపింది. ఇది రూ .612 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది . ఈ త్రైమాసికంలో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్ 642 కోట్ల జీబీ  ఉండగా, అదే సమయంలో వాయిస్ ట్రాఫిక్ 44871 కోట్ల నిముషాలుగా ఉంది .

ఫలితాలను వెల్లడిస్తూ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  అయిన ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, "ఇండియాలో డిజిటల్ రంగాన్ని విప్లవాత్మక  దిశగా నడపడానికి జియో తన మార్గంలో కొనసాగుతుంది . మేము గత 12 నెలల్లో మా కస్టమర్ బేస్ మరియు  యూజర్ మెట్రిక్స్ ను రెట్టింపు

చేశాము .  ప్రారంభించిన 22 నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 15 మిలియన్ల వినియోగదారులు ప్రపంచంలో ఎక్కడా ఏ సాంకేతిక పరిజ్ఞానం  అయినా సరే సాధించలేకపోయింది . జీయో డిజిటల్ సేవల కోసం ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించారు మరియు దాని సరసమైన మరియు సరళీకృత ధర వ్యూహం ప్రతి భారతీయుడికి కూడా  "పవర్ ఆఫ్ డేటా " అనుభూతి పొందే వీలును  కల్పించింది .   FTTH మరియు ఎంటర్ప్రైజెస్ సేవలు తో దేశవ్యాప్తంగా బలమైన ఫైబర్ వెన్నుముకగా ఉన్న జియో ఇప్పుడు ఒక డిజిటల్ సేవల ప్రదాతగా జీయో యొక్క నాయకత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మార్కెట్ లో పోటీ తీవ్రత ఉన్నప్పటికీ జియో ఆర్థిక ఫలితాల్లో కొనసాగుతున్న బలం, దాని సేవలను వినియోగదారుడు తీసుకునేలానే  కాకుండా దాని బలమైన కార్యాచరణ పరపతిని కూడా మరింత బలపరుస్తుంది.జీయో తన వాటాదారులందరికీ అత్యంత విలువను అందించడానికి కట్టుబడి ఉంది", అని చెప్పారు .

రిలయన్స్ జియో తన జియోగిగాఫైబర్ సేవలను త్వరగా అందించడానికి ప్రణాళిక చేస్తుందని తెలియచేసారు. ఈ నెల మొదట్లోనే ఈ సేవలకు సంభందించిన ప్రకటన చేసారు. ఆగస్టు 15 నుండి ప్రారంభమయ్యే ఈ సేవలకు  1,100 నగరాల నుండి వినియోగదారులు నమోదు చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. నిర్దిష్ట ప్రాంతం నుండి  వచ్చిన అభ్యర్థనల సంఖ్య ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, అని వివరించారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :