47th RIL AGM నుంచి Jio AI Cloud వెల్ కమ్ ఆఫర్ అనౌన్స్ చేసిన ముఖేష్ అంబానీ.!

Updated on 29-Aug-2024
HIGHLIGHTS

47th RIL AGM నుంచి కొత్త సర్వీస్ లను అందించింది

ఈ కార్యక్రమం నుంచి Jio AI Cloud Welcome ఆఫర్ ను అనౌన్స్ చేశారు

ఆఫర్ లో భాగంగా 100GB వరకూ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అనౌన్స్

ఈరోజు రిలయన్స్ నిర్వహించిన 47th RIL AGM నుంచి Jio AI Cloud Welcome ఆఫర్ ను అనౌన్స్ చేశారు. జియో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమం నుంచి కొత్త సర్వీస్ మరియు ప్రోడక్ట్స్ ను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కూడా కొత్త సర్వీస్ లను అందించింది. ఈ కార్యక్రమం ప్రారంభంలోనే Reliance Brain పేరుతో AI మోడల్ ప్రకటించిన ముఖేష్ అంబానీ, వెంటనే దానికి అనుగుణంగా జియో AI క్లౌడ్ వెల్ కమ్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేశారు.     

Jio AI Cloud Welcome

యూజర్లకు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ ను ఎక్కడ నుంచైనా ఉపయోగించడానికి వీలుగా జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్ ను పరిచయం చేసినట్లు అంబానీ ప్రకటించారు. ఈ సర్వీస్ కోసం ప్రత్యేకమైన వెల్ కమ్ ఆఫర్ ను కూడా ఈ మీటింగ్ నుంచి అనౌన్స్ చేశారు. జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్ వెల్ కమ్ ఆఫర్ లో భాగంగా 100GB వరకూ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ను ఆఫర్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు.

ఈ కొత్త జియో ఎఐ క్లౌడ్  సర్వీస్ మరియు వెల్ కమ్ ఆఫర్ 2024 దీపావళి పండుగ రోజు నుంచి ప్రారంభం అవుతుందని కూడా ప్రకటించారు.

Jio AI Cloud Storage ఎలా ఉపయోగపడుతుంది?

ఈ జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఫోటోలు, వీడియోలు, పర్సనల్ డేటా మరియు మరిన్ని ఇతర డిజిటల్ ఫైల్స్ ను ఆన్లైన్లో స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, గూగుల్ క్లౌడ్ సర్వీస్ గూగుల్ వన్ మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు. గూగుల్ ఈ సర్వీస్ ను 15GB స్టోరేజ్ వరకు ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Also Read: Reliance Brain పేరుతో AI మోడల్ ప్రకటించిన ముఖేష్ అంబానీ.! 

అయితే, ఈ సర్వీస్ ను పూర్తి స్థాయి ప్రయోజనాలు మరియు అధిక స్టోరేజ్ కోసం గూగుల్ నెలకు రూ. 130 రూపాయలు నుంచి 2TB స్టోరేజ్ హై ఎండ్ ప్లాన్ కోసం నెలకు రూ. 1,950 రూపాయల సబ్ స్క్రిప్షన్ ఛార్జ్ వసూలు చేస్తోంది. అయితే, జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ కోసం 100GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అందిస్తున్నట్లు తెలిపారు. అయితే, జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్ వివరాలు ఇంకా ప్రకటించలేదు.              

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :