Redmi Pad SE 4G: షియోమీ ఇండియాలో కొత్త నోట్ ప్యాడ్ రెడ్ మీ ప్యాడ్ SE 4జి ను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ నోట్ ప్యాడ్ ను అధిక స్టోరేజ్, 4G కనెక్టివిటీ, పెద్ద బ్రైట్ స్క్రీన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో తీసుకు వస్తోంది. ఈ అప్ కమింగ్ ప్యాడ్ టీజర్ పేజీ నుండి దీని కీలకమైన ఫీచర్స్ తో ఆటపట్టిస్తోంది. ఈ ప్యాడ్ లాంచ్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
రెడ్ మీ ప్యాడ్ SE 4G నోట్ ప్యాడ్ ను జూలై 29 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తుందని షియోమీ తెలిపింది. ఈ ప్యాడ్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా ఈ టీజర్ పేజీ నుండి వెల్లడించింది.
రెడ్ మీ ప్యాడ్ SE 4G ప్యాడ్ ను పెద్ద బ్రైట్ HD స్క్రీన్ తో తీసుకు వస్తున్నట్లు రెడ్ మీ తెలిపింది. ఈ నోట్ ప్యాడ్ ను 4G కనెక్టివిటీ తో అందిస్తుంది మరియు ఈ ప్యాడ్ లో 128GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉందని కూడా వెల్లడించింది. ఈ ప్యాడ్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ మరియు స్టీరియో స్పీకర్లు ఉంటాయి. ఈ ఫీచర్ తో గొప్ప క్లియర్ సౌండ్ తో వర్చువల్ క్లాస్ లేదా మ్యూజిక్ వీడియో లేదా OTT లను ఆనందించవచ్చు.
రెడ్ మీ ప్యాడ్ SE 4G ప్యాడ్ తేలికగా ఉంటుంది మరియు ట్రావెలింగ్ లో నావిగేటర్, ట్రావెల్ వ్లాగ్స్ గా సహాయపడుతుంది అని కూడా చెబుతోంది. ఈ నోట్ ప్యాడ్ లో వెనుక 8MP సింగల్ మెయిన్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ రెడ్ మీ అప్ కమింగ్ ప్యాడ్ రెండు కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. అంతేకాదు, ఇది రౌండ్ కార్నర్ కలిగిన సన్నని స్లీక్ డిజైన్ తో వుంది.
Also Read: Sennheiser కొత్త ఇయర్ బడ్స్ ను హార్ట్ రేట్ మరియు బాడీ టెంపరేచర్ ట్రాకర్ తో లాంచ్ చేసింది.!
అయితే, టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ నోట్ ప్యాడ్ కొంచెం పెద్ద బెజెల్స్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది పట్టుకోవడానికి మరియు విజిబిలిటీకి అనువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ప్యాడ్ యొక్క ఇతర కీలకమైన వివరాలు కూడా త్వరలో బయట పెట్టే అవకాశం వుంది.