Realme ఇప్పుడు 4 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జ్ చేసే 320W Supersonic ఛార్జ్ టెక్ తెచ్చింది.!
మొబైల్ మార్కెట్ లో కొత్త ఒరవడిని సృష్టించే కొత్త ఛార్జ్ టెక్ వచ్చింది
Realme 4 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జ్ చేసే 320W Supersonic ఛార్జ్ టెక్ తెచ్చింది
ఈ కొత్త ఛార్జ్ టెక్ తో కేవలం 4 నిమిషాల 22 సెకన్లలోనే ఫోన్ ను 100% ఛార్జ్ చేయవచ్చు
Realme ఇప్పుడు మొబైల్ మార్కెట్ లో కొత్త ఒరవడిని సృష్టించే కొత్త టెక్ ను తీసుకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కెమెరా, ఛార్జ్, ప్రోసెసర్ లతో పాటు డిస్ప్లే విభాగాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాదు, అన్ని మొబైల్ తయారీ కంపెనీలు కూడా కొత్త తమ ఫోన్ లలో కొత్త టెక్ ను పరిచయం చేయడానికి ఆశక్తి చూపుతున్నారు. ఇదే దారిలో, రియల్ మీ ఇప్పుడు ఇప్పుడు 4 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జ్ చేసే 320W Supersonic ఛార్జ్ టెక్ తెచ్చింది.
Realme 320W Supersonic
రియల్ మీ యొక్క చైనా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నుంచి ఈ కొత్త ఛార్జ్ టెక్ ను ప్రకటించింది. 320W సూపర్ సోనిక్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఛార్జ్ టెక్ తో కేవలం 4 నిమిషాల 22 సెకన్లలోనే ఫోన్ ను 100% ఛార్జ్ చేయవచ్చు అని లైవ్ డెమో వేసి మరి చూపించింది.
రియల్ మీ యొక్క అధికారిక x అకౌంట్ ను ను నుంచి ఈ ఛార్జ్ టెక్ మరియు మరిన్ని ఇతర కొత్త వివరాలు కూడా వెల్లడించింది. కంపెనీ ప్రకారం, కొత్త ఛార్జ్ టెక్ మొబైల్ ఫోన్ లను ఎన్నడూ చూడనంత వేగంగా ఫోన్ ను ఛార్జ్ చేస్తుందని తెలిపింది. లైవ్ డెమో వీడియో లో ఈ కొత్త ఛార్జ్ టెక్ తో ఫోన్ ను 2 నిమిషాల వ్యవధిలోనే 50% ఛార్జ్ మరియు 4 నిమిషాల 22 సెకన్ల లో ఫోన్ ను 100% చేయడం చూపించింది.
కేవలం ఛార్జ్ టెక్ మాత్రమే కాకుండా అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే మరియు సేఫ్ గా ఉండే 4 సెల్ ఫోల్డెడ్ బ్యాటరీ గురించి కూడా ప్రకటించింది. అంతేకాదు, ఎయిర్ ఐసోలేషన్ సేఫ్ మరియు మరింత అడ్వాన్స్ ఛార్జింగ్ కోసం కొత్త AirGap Voltage ట్రాన్స్ ఫార్మర్ ను కూడా తీసుకు వచ్చినట్లు రియల్ మీ తెలిపింది. డ్యూయల్ టైప్ C పోర్ట్ లు కలిగిన కాంపాక్ట్ సైజు పోకెట్ కెనాన్ ఛార్జర్ ను కూడా ను పరిచయం చేసింది.
Also Read: Rakhi 2024: ఈ రాఖీ పండుగ గిఫ్ట్ గా బడ్జెట్ 5G ఫోన్ ఇవ్వాలనుకుంటున్నారా.!
పైన తెలిపిన మూడు టెక్ లను పరిచయం చేసిన మొదటి కంపెనీ గా రియల్ మీ ఇప్పుడు చరిత్ర కెక్కింది.