RBI New UPI Rules: యుపిఐ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన రిజర్వ్ బ్యాంక్.!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను తీసుకు వచ్చింది
రిజర్వ్ బ్యాంక్ UPI పరిధిని మరింత విస్తరించింది
UPI పెమెంట్స్ తో పాటుగా క్యాష్ డిపాజిట్ కు కూడా అవకాశం
RBI New UPI Rules: దేశవ్యాప్తంగా పెరుగుతున్న యుపిఐ యూజర్లు మరియు ట్రాన్సాక్షన్ లతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను తీసుకు వచ్చింది. వాస్తవానికి, నియమాలు అనడం కంటే ఫీచర్స్ లేదా ఉపయోగకరమైన చర్యలు తీసుకుంది అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, యుపిఐ యూజర్లు ఇప్పటి వరకూ కేవలం పేమెంట్ లను చేయ్యడానికి మాత్రమే యుపిఐ ని ఉపయోగిస్తుండగా, రిజర్వ్ బ్యాంక్ ఈ పరిధిని మరింత విస్తరించింది.
RBI New UPI Rules:
యుపిఐ యూజర్లు ఇక నుండి పేమెంట్ లతో పాటుగా డబ్బును డిపాజిట్ చెయ్యడానికి కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్ (యుపిఐ) ఉపయోంచవచ్చని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్, ఈ కొత్త ఫీచర్ ను వెల్లడించారు. యుపిఐ పెమెంట్స్ తో పాటుగా క్యాష్ డిపాజిట్ కు కూడా అవకాశం కల్పించింది ద్వారా యుపిఐ యూజర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చని తెలిపారు.
Also Read: Big Deal: రూ. 9,499 రూపాయలకే Redmi 13C 5G ఫోన్ అందుకోండి.!
అంటే, క్యాష్ డిపాజిట్ మెషిన్ లో క్యాష్ డిపాజిట్ లను యుపిఐ ని ఉపయోగించి చేసుకునే వీలుంటుంది. అంతేకాదు, యుపిఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్ తో పాటుగా మరొక ఫీచర్ ను కూడా తీసుకు వచ్చింది. అదేమిటంటే, తర్డ్ పార్టీ యాప్స్ ను ఉపయోగించి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs) యుపిఐ పేమెంట్ లను కూడా చేయవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించి UPI పేమెంట్స్ చేయడానికి డిజిటల్ వాలెట్స్ లాంటి PPI లను ఉపయోగించుకోవచ్చు. అంటే, ఆర్ బి ఐ కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఫీచర్ ద్వారా PPI వాలెట్ హోల్డర్ లను (PhonPe వంటి చాలా యాప్స్) ట్రాన్సక్షన్ కోసం థర్డ్ పార్టీ UPI యాప్స్ తో యూజర్లు తమ వాలెట్ లను లింక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఇలా చేయడం ద్వారా యూజర్లు యుపిఐ యూజర్లు వారి పేమెంట్ లను మరింత సులభంగా మరియు మెరుగ్గా చేసుకునే వీలుంటుంది.