Power Bill: కరెంట్ బిల్ పేమెంట్ పైన RBI ఆంక్షలు.. Online లో ఎలా కట్టాలో తెలుసుకోండి .!
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరెంట్ బిల్ పేమెంట్స్ పైన RBI ఆంక్షలు
UPI యాప్స్ తో నేరుగా కరెంట్ బిల్ పేమెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది
చాలా సింపుల్ గా ఆన్లైన్ లో కరెంట్ బిల్ పేమెంట్ చెయ్యాలో ఇక్కడ తెలుసుకోవచ్చు
Power Bill: గతంలో కరెంట్ బిల్ పేమెంట్ చెయ్యాలంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వద్ద లైన్ లో పడిగాపులు కాయాల్సి వచ్చేది. అయితే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆన్లైన్ చేసిన తర్వాత UPI పుణ్యమా అని గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటీఎం వంటి ఇతర UPI యాప్స్ తో చెల్లించే అవకాశం దక్కింది. ఒక్కసారి యూనిక్ సర్వీస్ నెంబర్ ను రిజిస్టర్ చేసి పే చేస్తే చాలు, ప్రతినెలా బిల్ అప్డేట్ మరియు పేమెంట్ వివరాలు నోటిఫై చేస్తాయి ఈ యాప్స్. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరెంట్ బిల్ పేమెంట్స్ పైన RBI ఆంక్షలు విధించింది. దీనితో, UPI యాప్స్ తో నేరుగా కరెంట్ బిల్ పేమెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కరెంట్ బిల్ ఎలా పేమెంట్ చెయ్యాలో తెలియక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, చాలా సింపుల్ గా ఆన్లైన్ లో కరెంట్ బిల్ పేమెంట్ చెయ్యాలో తెలియచేస్తున్నాము.
Power Bill ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ జూలై 1 నుండి నయా రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం కస్టమర్లు UPI యాప్స్ ద్వారా ఆన్లైన్ లో కరెంట్ బిల్లులు చెల్లించడం కుదరదు. దానికి బదులుగా ప్రభుత్వం యోక్క అధికారిక వెబ్ సైట్ మరియు యాప్స్ ని ఉపయోగించాలి. అందుకే ఇరు రాష్ట్రాల్లో కొత్త ఆన్లైన్ పద్దతి ద్వారా కస్టమర్లు కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు.
తెలంగాణ రాష్ట్ర కరెంట్ వినియోగదారులు TGSPDCL యాప్ లేదా https://tgsouthernpower.org అధికారిక సైట్ ద్వారా కరెంట్ బిల్స్ ను చెల్లింవచ్చు. ఈ సైట్ లేదా యాప్ లో యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి అందుకున్న కస్టమర్ వివరాల ను సరి చూసుకొని కరెంట్ బిల్ ను చెల్లించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కరెంట్ వినియోగదారులు APCPDCL యాప్ లేదా www.apcpdcl.in వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు. కస్టమర్లు, సైట్ లేదా యాప్ లో Pay Your Bill ట్యాబ్ ను పైన నొక్కి అడిగిన వద్ద యూనిక్ సర్వీస్ నెంబర్ ను ఎంటర్ చేసి బిల్ ను చెల్లించాలి.
Also Read: Motorola Razr 50 Ultra: కొత్త ఫ్లిప్ ఫోన్ ను Gemini Ai సపోర్ట్ తో విడుదల చేసిన మోటోరోలా.!
వెబ్సైట్ ద్వారా బిల్లు చెల్లించాలి అనుకుంటే Billdesk ఆప్షన్ ను ఎంచుకొని, ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు వెంటనే మీ బిల్ వివరాలు వస్తాయి మరియు క్రింద సబ్ మీట్ బటన్ ను నొక్కండి. తర్వాత, వచ్చే పేమెంట్ ఆప్షన్ లలో ఒకదానిని ఎంచుకొని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్ మరియు UPI యాప్ ద్వారా కూడా పే చేయవచ్చు.