RBI మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తుందని కాల్ వచ్చిందా.. జర భద్రం సామి ఇదో కొత్త రకం Scam.!
స్కామర్లు కొత్త కొత్త స్కామ్ లను వెతికి మరీ ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు
స్కామర్లు ఇప్పుడు కొత్త వాయిస్ మెయిల్ మరియు వాయిస్ కాల్ తో స్కామ్ చేస్తున్నారు
ఈ కొత్త స్కామ్ కాల్ తో జర జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ తెలిపింది
స్కామర్లు కొత్త కొత్త స్కామ్ లను వెతికి మరీ ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఫేక్ క్యూఆర్ కోడ్ స్కామ్, ఫేక్ వీడియో కాలింగ్ లతో దోచుకున్న స్కామర్లు ఇప్పుడు కొత్త వాయిస్ మెయిల్ మరియు వాయిస్ కాల్ తో స్కామ్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ కాల్ తో జర జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ తెలిపింది. RBI మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తుందని వాయిస్ కాల్ ని పంపిస్తున్నారు స్కామర్లు ఈ కాల్స్ అన్ని కూడా ఫేక్ అని ప్రభుత్వం తెలిపింది.
ఏమిటి ఈ కొత్త Scam?
స్కామర్లు ఇప్పుడు కొత్తగా RBI మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తుందనే వాయిస్ కాల్ ను తమ స్కామ్ కోసం వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ చేసినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మీ అకౌంట్ ను రానున్న రెండు గంటల్లో బ్లాక్ చేస్తుందని ఈ వాయిస్ మెసేజ్ చెబుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 9 నెంబర్ ను నొక్కండి అని పలుకుతుంది.
ఇదంతా కూడా స్కామర్లు వేసిన వల, ఈ వాయిస్ కాల్ చెప్పినట్టు 9 నెంబర్ నొక్కారంటే మీ పని అయిపోతుంది. ఇదంతా కూడా స్కామర్లు వేసుతున్న వల అని ఇలాటివి నమ్మవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. వాస్తవానికి, RBI ఎప్పుడూ కూడా ప్రజలను నేరుగా సంప్రదించదు. అది కూడా ఫోన్ కాల్, SMS లేదా వాట్సాప్ ద్వారా అస్సలు సంప్రదించదు అని గుర్తుంచుకోండి.
Also Read: మొబైల్ నెంబర్ యూజర్ల కోసం TRAI శుభవార్త.!
మరి ఏమి చేయాలి?
ఇటువంటి కాల్స్ మీకు వచ్చినట్లయితే వెంటనే ఈ ఫోన్ కాల్ ను కట్ చేసి ఈ నెంబర్ ను బ్లాక్ చేయండి. అంతేకాదు, ఈ నెంబర్ ను రిపోర్ట్ చేసి ఇతరులకు సహకరించండి. ఇక వేల ఇటివంటి ఫేక్ మెయిల్ అనుకున్నట్లయితే ఈ విషయంలో సైబర్ క్రైం పోర్టల్ లేదా లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేయడం మంచిది.