రేషన్ కార్డ్ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్..!

Updated on 30-Mar-2023
HIGHLIGHTS

రేషన్ కార్డ్ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది

ఆధార్ కార్డ్ తో రేషన్ కార్డును లింక్ చేయడం తప్పుసరి చేసిన కేంద్రం

ఆఖరి గడువు తేదీని ప్రజల సౌకర్యార్ధం పొడిగించనట్లు ప్రకటించింది

రేషన్ కార్డ్ ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డ్ లబ్ధిదారులు అందరూ కూడా విధిగా వారి ఆధార్ కార్డ్ తో వారి రేషన్ కార్డును లింక్ చేయడం తప్పుసరి చేసిన కేంద్రం, ముందుగా నిర్ణయించిన ఆఖరి గడువు తేదీని ప్రజల సౌకర్యార్ధం  పొడిగించనట్లు ప్రకటించింది. మార్చి 31 లోపుగా రేషన్ కార్డ్ ఆధార్ లింక్ కోసం డెడ్ లైన్ ప్రకటించిన కేంద్రం, ఇప్పుడు ఈ గడువును జూన్ 30 వరకూ పొడిగించినట్లు తెలిపినట్లు తెలిపింది.

ప్రభుత్వం సరఫరా చేసే నిత్యవసర సరుకులు అర్హత కలిగిన లబ్ధిదారులకు అందేలా చూసేందుకు, రేషన్ కార్డ్ ను ఆధార్ ను అనుసంధానం చేయడం సరైన మార్గం కాబట్టే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా, నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా అరికట్టే వీలుంది. అందుకే, రేషన్ కార్డ్ తో ఆధార్ అనుసంధానం తప్పని సరి చేసింది. అయితే, ప్రజలు ఇబ్బదందులు పడకుండా ఉండేందుకు వీలుగా గడువును కూడా పెంచింది. 
                     
వాస్తవానికి, మీ రేషన్ కార్డ్ తో మీ ఆధార్ కార్డ్ ను ఆన్లైన్ లోనే చాలా సులభంగా మీరే లింక్ చేసుకోవచ్చు. PDS portal (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) పోర్ట్ కు ఓపెన్ చేసి, అందులో మీ రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ మరియు మీ రిజిస్టర్ నంబర్ లను నమోదు చెయ్యాలి. అటుతరువాత మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ పైన అందుకున్న OTP నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ ఆధార్ ను మీ రేషన్ కార్డ్ తో లింక్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :