మినీ కంప్యూటర్ ధర 700 రూ
Raspberry Pi వారు దీనిని అందిస్తున్నారు.
మినీ కంప్యూటర్ ధర 10 డాలర్లలోపే ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.700 కంటే తక్కువే,రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ' (Raspberry Pi Zero W) పేరుతో సరికొత్త బోర్డ్ ఆధారిత మినీ కంప్యూటర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు రాస్ప్‌బెర్రీ పీఐ ఫౌండేషన్ సగర్వంగా తెలిపింది. దీని సైజు క్రెడిట్ కార్డు సిజాన్తా ఉంటుంది. . కంపాక్ట్ డిజైన్, తక్కువ ధర, తక్కువ విద్యుత్ వినియోగం వంటి విశిష్టతలను ఈ బోర్డు కలిగి ఉండుట దీని ప్రత్యేకత 2015లో లాంచ్ అయిన రాస్ప్‌బెర్రీ పీఐ జీరో బోర్డుతో పోలిస్తే రాస్ప్‌బెర్రీ పీఐ జీరో డబ్ల్యూ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0 ఇన్‌బిల్ట్ కనెక్టువిటీ ఫీచర్లు అదనంగా ఈ మినీ కంప్యూటర్‌లో వున్నాయి. DIY ప్రాజెక్టుల్లో మెయిన్ రోల్ దీనిదే. BCM2835 అప్లికేషన్ ప్రాసెసర్ (1GHz ARM11 కోర్), 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ స్లాట్, మినీ HDMI పోర్ట్, మైక్రో యూఎస్బీ ఆన్ ద గో పోర్ట్, మైక్రో యూఎస్బీ పవర్ పోర్ట్, HAT-compatible 40 పిన్ రీడర్, కాంపోజిట్ వీడియో, రీసెడ్ హెడర్స్, సీఎస్ఐ కెమెరా కనెక్టర్, వై-ఫై 802.11n, బ్లుటూత్ 4.0.