AI తో తస్మాత్ జాగ్రత్త: టాప్ హీరోయిన్ నమ్మశక్యం కానీ డీప్ ఫేక్ వీడియో వైరల్.!
దేశంలో వైరల్ అయిన కొత్త AI Deep Fake క్రియేటెడ్ వీడియో
రష్మిక మందన్నను అసభ్యంగా చూపించేలా ఉన్న వీడియోగా వైరల్ అయ్యింది
బాలీవుడ్ బిగ్ స్టార్ అమితా బచ్చన్ ఈ విషయం పైన ఘాటుగా స్పందించారు
AI తో తస్మాత్ జాగ్రత్త అని యావత్ దేశాన్ని కలవర పరిచేలా ఒక వీడియో వైరల్ అయ్యింది. నానాటికి పెరుగుతున్న టెక్నాలజీతో ఉపయోగం ఎంతుందో తెలియదు కానీ, ప్రమాదం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు దేశంలో వైరల్ అయిన కొత్త AI Deep Fake క్రియేటెడ్ వీడియో దేశాన్ని షేక్ చేస్తున్న విషయాన్ని దీనికి సింపుల్ సరైన చెప్పవచ్చు.
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నను అసభ్యంగా చూపించేలా ఉన్న ఒక వీడియోగా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే, వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నది రష్మిక కానే కాదు, అదొక డీప్ ఫేక్ వీడియో. ఈ కొత్త వైరల్ వీడియో అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం పదండి.
రష్మిక మందన్న నల్లని యోగా సూట్ లో ఎలివేటర్ లోకి ప్రవేస్తునట్లు ఉన్న ఒక వీడియోని క్రియేట్ చేసి నెట్టింట షేర్ చేశారు. అయితే, దీన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తరువాత ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అయ్యింది. బాలీవుడ్ బిగ్ స్టార్ అమితా బచ్చన్ ఈ విషయం పైన ఘాటుగా స్పందించారు.
తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వైరల్ వీడియో గురించి ‘ఇటివంటి వాటి పైన గట్టి చర్యలు తీసుకోవాలని’ గట్టిగా చెప్పారు.
Also Read : Smart Tv Offer: అమేజాన్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ టీవీల పైన బిగ్ డీల్స్ | Sale Offers
ఈ చర్య పైన రష్మిక మందన్న కూడా స్పందించారు. ఇటువంటి ఒక సంఘట స్కూల్ లేదా కాలేజ్ సమయంలో జరిగి ఉంటే ఎలాగా ఎదుర్కునే దానినే తెలియదు. ఇది అందరూ కూడా ద్రుష్టి సారించవలసిన విషయం మరియు ఈ విషయం పైన నాకు మద్దతుగా నిలిచినా అందరికి నా కృతజ్ఞతలు అని, తన ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు.