Rakhi 2024: రాఖీ పండుగ విషెస్ మరియు స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.!

Rakhi 2024: రాఖీ పండుగ విషెస్ మరియు స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.!

Rakhi 2024: అన్నా చెల్లెలి ప్రేమకు ప్రతీకగా ‘రక్షా బంధన్’ పండుగ వచ్చేసింది. ఈరోజు మీ తోబుట్టువుల పట్ల మీ ప్రేమను మరియు ప్రశంసలను తెలియజేయడానికి ఇది సరైన సమయం. మీరు కలిసి ఒకే వద్ద ఉన్నా లేదా మైళ్ల దూరంలో ఉన్నా, మీ సహోదరికి పంపించే హృదయపూర్వక WhatsApp విషెస్, వారికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. అందుకే, ఈరోజు ఈ కథనంలో, మీ సహోదరికి పంపతగిన 20 కి పైగా రక్షా బంధన్ శుభాకాంక్షలు అందిస్తున్నాను.

Rakhi 2024: విషెస్

Rakhi 2024 wishes
  • దైవం కూడా విడదీయలేనిది రక్త సంబంధం, ఈ జన్మలో నీ కష్ట సుఖాల్లో నేనున్నాను నా సోదరి, హ్యాపీ రక్షా బంధన్.
  • 2024 రాఖీ పండుగ శుభాకాంక్షలు, ఈ సంవత్సరం నీకు సుఖ సంతోషాలు మరియు భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను.
  • ఈ రాఖీ పండుగ రోజు నువ్వు ఎంతో ఆనందంగా, సంతోషంగా గడపాలని ఆశిస్తున్నాను.
  • నా అన్నగారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు! మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను.
  • ఈ రాఖీ పండుగ మీకు సంతోషం, ఆనందం తీసుకు రావాలని కోరుకుంటున్నాను.
  • అన్నా, మీకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మా ప్రేమ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది.
  • ఈ రాఖీ పండుగ మీకు ఎనలేని సంతోషం అందించే పండుగ కావాలని, మీ అన్ని కోరికలు తీరాలని ఆశిస్తున్నాను.
  • రాఖీ పండుగ నువ్వు అందరితో కలిసి ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను.
  • నా సోదరుడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు! ఈ రోజు నీ జీవితానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజు కావాలని కోరుకుంటున్నాను.
  • నా సోదరికి ఈ రాఖీ పండుగ ఎంతో ఆనందాన్ని మరియు శాంతిని తీసుకురావాలని ఆశిస్తున్నాను.
  • ఈ రాఖీ పండుగ మీకు కొత్త ఆశలు మరియు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే రోజుగా ఉండాలని ఆశిస్తున్నాను.
  • నువ్వు లేకుంటే నేను లేను..నన్ను విసిగించినా, లాలించి నా, బుజ్జగించినా, నన్ను అల్లారు ముద్దుగా చూసేది నువ్వే.. హ్యాపీ రక్షా బంధన్.

Also Read: అమెజాన్ నుంచి Hyundai Smart Tv భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది.!

రాఖీ 2024 కోసం స్టేటస్ ఎలా డౌన్లోడ్ చేయాలి?

దీనికోసం యూట్యూబ్ డౌన్లోడర్ అత్యంత సులభమైన పద్దతి గా చూడవచ్చు. ఎందుకంటే, అతిపెద్ద వీడియో ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ లో ఎక్కువగా ఆప్షన్స్ లభిస్తాయి. అందుకే, ముందుగా యూట్యూబ్ లోకి వెళ్లి ‘Raksha Bandhan’ అని సెర్చ్ చేసి వచ్చిన వీడియో లలో మీకు నచ్చిన వీడియో లింక్ ను కాపీ చేయండి. తరువాత, ఈ లింక్ ను యు ట్యూబ్ డౌన్ లోడర్ లో పేస్ట్ చేసి ఆ వీడియో ను డౌన్ లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునే వీడియో ను మీ వాట్సాప్ స్టేటస్ గా సెట్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo