QR Code Scam తో 2.3 లక్షలు పోగొట్టుకున్న పూణే కి చెందిన పోలీస్ కానిస్టేబుల్.!
దేశంలో కొత్త కొత్త ఆన్లైన్ స్కామ్ లు పుట్టుకొస్తున్నాయి
ప్రజలను మరొక కొత్త రకం QR Code Scam స్కామ్ మరింత భయపెడుతోంది
QR Code Scam తో పూణే కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ 2.3 లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు
దేశంలో కొత్త కొత్త ఆన్లైన్ స్కామ్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలో పెరిగిన స్కామ్ లతో సతమవుతున్న ప్రజలను మరొక కొత్త రకం స్కామ్ మరింత భయపెడుతోంది. అదే, QR Code Scam మరియు ఈ కొత్త రకం స్కామ్ తో పూణే కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ 2.3 లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న అసలు కథ తెలిస్తే మాత్రం వణుకు పుడుతుంది.
QR Code Scam
పూణేకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ బేకరీలో కొన్న వస్తువులకు డబ్బులు చెల్లించడానికి క్యూఆర్ కోడ్ ని ఉపయోగించారు. ఇక్కడ వరకు కదా అంతా బాగానే ఉంది. అయితే, తర్వాత నుంచి కదా అడ్డం తిరిగింది. ఎప్పటి లాగానే నిర్వహించే క్యూఆర్ కోడ్ పేమెంట్ తన అకౌంట్ ఖాళీ చేస్తుందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయారు.
తన అకౌంట్ నుంచి తనకు తెలియకుండా రూ. 18,755 రూపాయల డెబిట్ అయినట్టు గమనించిన ఆ కానిస్టేబుల్ నిర్ఘాంతపోయారు. ఈ విషయం మీద దృష్టిపెట్టిన కానిస్టేబుల్ తన అకౌంట్ మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు, ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది. తనకు తెలియకుండా తన అకౌంట్ నుంచి అప్పటికే చాలా ట్రాన్సాక్షన్స్ జరిగిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన సదరు కానిస్టేబుల్ వెంటనే తన అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వాస్తవానికి సదరు కానిస్టేబుల్ కి చెందిన ఒక్క అకౌంట్ నుంచి మాత్రమే కాదు శాలరీ ఎకౌంటు మొదలుకొని గోల్డ్ లోన్ అకౌంట్ వరకు మొత్తం ఖాళీ చేశారు స్కామర్లు. స్కామర్లు ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే ఫోన్ ను పూర్తిగా లొంగ తీసుకొని OTP లను సైతం అందిపుచ్చుకొని మొత్తం అకౌంట్ లను కొల్లగొట్టారు.
వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏమిటంటే, క్యూఆర్ కోడ్ తో పేమెంట్ చేస్తున్నప్పుడు అందుకున్న లింక్ ద్వారా ఒక APK ఫైల్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ఫైల్ లో ఉన్న వైరస్ ఈ ఫోన్ ను పూర్తిగా అదుపులోకి తీసుకుంది మరియు ఈ ఫోన్ యొక్క పూర్తి యాక్సెస్ ను స్కామర్స్ కి అందించింది. ఈ విధంగా స్కామర్లు ఆ కానిస్టేబుల్ అకౌంట్ ను దోచుకున్నారు.
Also Read: 24 వేల రూపాయల బడ్జెట్ లో 50 ఇంచ్ 4K UHD Smart Tv కావాలా.. ఒక లుక్కేయండి.!
ఈ క్యూఆర్ కోడ్ ద్వారా జరిగిన స్కాం పై వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే, పేమెంట్ చేస్తున్నప్పుడు వివరాలు సరిగ్గా చూసుకోవాలని మరియు రిసీవర్ పేరును చెక్ చేసుకుని పేమెంట్స్ చెయ్యాలని చెబుతున్నారు. ముఖ్యంగా, ఏదైనా లింక్ ద్వారా పేమెంట్ చేయాలనీ సూచిస్తే అటువంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.