తైవాన్ బేస్ కంపెనీ Promate ఈరోజు ఇండియాలో కొత్త పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ప్రపంచంలోనే అతి చిన్న 10000mAh పవర్ బ్యాంక్ అని దీని గురించి Promate ప్రకటించింది. ఏటువంటి ఇబ్బంది లేకుండా జేబులో కూడా క్యారీ చేసేలా అల్ట్రా కాంపాక్ట్ డిజైన్ మరియు సైజులో ఈ పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ ను తీసుకొచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ లేటెస్ట్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
ACME-PD20 మోడల్ పేరుతో ప్రోమేట్ ఈ కొత్తగా పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ధర రూ. 3,199 మరియు ఇది అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులో వుంది. ఈ ACME-PD20 10000mAh పవర్ బ్యాంక్ చాలా సన్నగా మరియు తేలికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రోమేట్ పవర్ బ్యాంక్ కేవలం 5.8cm x 7.9cm కొలతలను కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ అధిక సామర్ధ్యం కలిగిన lithium-ion బ్యాటరీని కలిగి ఉంటుంది.
ACME-PD20 10000mAh పవర్ బ్యాంక్ 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన టైప్-C 22.5W QC 3.0 పోర్ట్ తో వస్తుంది. అయితే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉన్న ఈ పవర్ బ్యాంక్ సేఫ్టీ ఫీచర్ లను కలిగి వుందని కూడా కంపెనీ తెలిపింది. మంచి ఛార్జింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి ఈ పవర్ బ్యాంక్ లో అడ్వాన్స్డ్ చిప్ సెట్ ప్రొటెక్షన్, ఓవర్ హీట్ మరియు హై వోల్టేజ్ ప్రొటక్షన్ కోసం మల్టీ ప్రొటెక్షన్ IC సముదాయాన్ని కూడా కలిగివుందని తెలిపింది.
తద్వారా, ఈ ప్రోమేట్ పవర్ బ్యాంక్ మరింత సౌకర్యం మరియు సేఫ్ ఛార్జ్ ను అందించగలదని ప్రోమేట్ వివరించింది.