అతి చిన్న 10000mAh పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసిన Promate.!
Promate ఈరోజు ఇండియాలో కొత్త పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది
అతి చిన్న 10000mAh పవర్ బ్యాంక్ అని దీని గురించి Promate ప్రకటించింది
జేబులో కూడా క్యారీ చేసేలా అల్ట్రా కాంపాక్ట్ డిజైన్ లాంచ్
తైవాన్ బేస్ కంపెనీ Promate ఈరోజు ఇండియాలో కొత్త పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ప్రపంచంలోనే అతి చిన్న 10000mAh పవర్ బ్యాంక్ అని దీని గురించి Promate ప్రకటించింది. ఏటువంటి ఇబ్బంది లేకుండా జేబులో కూడా క్యారీ చేసేలా అల్ట్రా కాంపాక్ట్ డిజైన్ మరియు సైజులో ఈ పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ ను తీసుకొచ్చినట్లు ప్రోమేట్ తెలిపింది. ఈ లేటెస్ట్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
ACME-PD20 మోడల్ పేరుతో ప్రోమేట్ ఈ కొత్తగా పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ధర రూ. 3,199 మరియు ఇది అమెజాన్ నుండి సేల్ కి అందుబాటులో వుంది. ఈ ACME-PD20 10000mAh పవర్ బ్యాంక్ చాలా సన్నగా మరియు తేలికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రోమేట్ పవర్ బ్యాంక్ కేవలం 5.8cm x 7.9cm కొలతలను కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ అధిక సామర్ధ్యం కలిగిన lithium-ion బ్యాటరీని కలిగి ఉంటుంది.
ACME-PD20 10000mAh పవర్ బ్యాంక్ 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన టైప్-C 22.5W QC 3.0 పోర్ట్ తో వస్తుంది. అయితే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉన్న ఈ పవర్ బ్యాంక్ సేఫ్టీ ఫీచర్ లను కలిగి వుందని కూడా కంపెనీ తెలిపింది. మంచి ఛార్జింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి ఈ పవర్ బ్యాంక్ లో అడ్వాన్స్డ్ చిప్ సెట్ ప్రొటెక్షన్, ఓవర్ హీట్ మరియు హై వోల్టేజ్ ప్రొటక్షన్ కోసం మల్టీ ప్రొటెక్షన్ IC సముదాయాన్ని కూడా కలిగివుందని తెలిపింది.
తద్వారా, ఈ ప్రోమేట్ పవర్ బ్యాంక్ మరింత సౌకర్యం మరియు సేఫ్ ఛార్జ్ ను అందించగలదని ప్రోమేట్ వివరించింది.