Prime Video యూజర్లకు గుడ్ గుడ్ న్యూస్ Apple TV+ ని యాడ్ ఆన్ ప్యాక్ గా ఆఫర్ చేస్తోంది.!

Prime Video యూజర్లకు గుడ్ గుడ్ న్యూస్ Apple TV+ ని యాడ్ ఆన్ ప్యాక్ గా ఆఫర్ చేస్తోంది.!
HIGHLIGHTS

Prime Video యూజర్లకు గుడ్ గుడ్ న్యూస్ అందించింది

యాపిల్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న Apple TV+ యాక్సెస్ ప్రైమ్ వీడియోతో అందిస్తోంది

చాలా తక్కువ ధరలో యాపిల్ ఒరిజినల్ కంటెంట్ ను అందుకునే అవకాశం

Prime Video యూజర్లకు గుడ్ గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటి వరకు యాపిల్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న యాపిల్ టీవీ ప్లస్ యాక్సెస్ ను ప్రైమ్ వీడియో ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త చర్యతో ఇండియాలో పెరుగుతున్న OTT యాప్స్ వినియోగ ట్రెండ్ మరియు కల్చర్ లో యాపిల్ టీవీ ప్లస్ ను కూడా మరింత మిళితం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, చాలా తక్కువ ధరలో యాపిల్ ఒరిజినల్ కంటెంట్ ను అందుకునే అవకాశం కూడా అందిస్తుంది.

Apple TV+ On Prime Video:

యాపిల్ టీవీ ప్లస్ తో ప్రైమ్ వీడియో అందించిన యాడ్ ఆన్ ప్యాక్ ఎంచుకున్న యూజర్లకు యాపిల్ టీవీ ప్లస్ యాప్ తో పని లేకుండా ప్రైమ్ వీడియో పైనే కంటెంట్ ను చూడవచ్చు. అంతేకాదు, తక్కువ ధరకే యాపిల్ టీవీ ప్లస్ సబ్ స్క్రిప్షన్ అందుకోవచ్చు. ప్రైమ్ వీడియో పై కేవలం రూ. 99 రూపాయలకే యాపిల్ టీవీ ప్లస్ సబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేస్తోంది.

వాస్తవానికి, ప్రైమ్ వీడియో ఇప్పటికే లయన్స్ ప్లే, డిస్కవరీ ప్లస్, BBC Player, MGM+, సోనీ పిక్చర్స్ – స్ట్రీమ్, యానీమ్ టైమ్స్, CN Rewind, FanCode వంటి మరిన్ని యాడ్ ఆన్ సబ్ స్క్రిప్షన్ లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యాపిల్ టీవీ ప్లస్ ను కూడా కొత్తగా చేర్చింది. ఈ సబ్ స్క్రిప్షన్ తో లేటెస్ట్ గా విడుదలైన సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ The Gorge, Silo మరియు Wolfs వంటి సినిమాలు ఎంజాయ్ చేయవచ్చు.

Apple TV+ On Prime Video

ప్రైమ్ వీడియో యూజర్లు ఇప్పుడు యాపిల్ టీవీ ప్లస్ ని కూడా యాడ్ ఆన్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా యాపిల్ టీవీ ప్లస్ సబ్ స్క్రిప్షన్ ను ఈజీగా పొందడానికి చూస్తుంటే, ప్రైమ్ వీడియో అందించిన ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. యాపిల్ టీవీ ప్లస్ ఒరిజినల్ సిరీస్ లు అయిన Ted Lasso, Severance, Slow Horses మరియు The Morning Show వంటి మరిన్ని సిరీస్ లను కూడా చూడవచ్చు.

Also Read: Vivo T4 5G దేశంలో పెద్ద బ్యాటరీ కలిగిన 5G ఫోన్ గా రాబోతుంది.!

మరి ముఖ్యంగా, యాపిల్ లో అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రైమ్ యాప్స్ లోకి వెళ్లి యాపిల్ టీవీ ప్లస్ ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo