Jio Cinema: ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తో ప్రీమియం కంటెంట్.!

HIGHLIGHTS

రిలయన్స్ యొక్క OTT యాప్ Jio Cinema

జనరంజక సిరీస్ మరియు మూవీ లను కూడా జియో సినిమా ప్రీమియం మెంబర్స్ చూడవచ్చు

ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కోసం ప్రీమియం కంటెంట్

Jio Cinema: ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తో ప్రీమియం కంటెంట్.!

రిలయన్స్ యొక్క OTT యాప్ Jio Cinema కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను కంపెనీ విడుదల చేసింది. Jio Cinema Premium ప్లాన్ ఎంచుకునే యూజర్లు ప్రీమియం కంటెంట్ ను ఎంజాయ్ చేసే అవకాశం అందించింది. IPL మ్యాచ్ లతో పాటుగా జనరంజక సిరీస్ మరియు మూవీ లను కూడా జియో సినిమా ప్రీమియం మెంబర్స్ చూడవచ్చు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Cinema Premium

జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కు కొత్త కంటే అందుబాటులోకి తీసుకు వచ్చింది రిలయన్స్. గతంలో, HBO భారతీయ OTT ల పైన ప్రసారం చేసిన తన కంటెంట్ ను ఉపసంహరించుకోగా, ఇప్పుడు రిలయన్స్ జియో సినిమా ప్రీమియం కోసం HBO మరియు Warner Bros యొక్క ప్రీమియం కంటెంట్ ను తిరిగి ఇండియాకి తీసుకొచ్చింది.   

ప్రీమియం సబ్ స్క్రైబర్స్ House Of The Dragon, GOT మరియు TheLast of US వంటి అన్ని HBO ఒరిజినల్ సిరీస్ లను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, Jio Cinema Premium యూజర్ల కోసం కొత్త సినిమాలు మరియు సిరీస్ లను జియో తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

IPL 2023 ఉచిత ప్రసారం తరువాత ఇండియాలో అధిక సంఖ్యలో యూజర్ బేస్ ను సంపాదించుకున్న రిలయన్స్ యొక్క OTT యాప్ Jio Cinema ప్రీమియం కంటెంట్ ప్రసారాలతో ఇప్పుడు మరింత ఎక్కువ సబ్ స్క్రైబర్స్ ను కూడా జత చేయవచ్చని యోచిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo