మీరేం చూస్తున్నారో facebook క్షణాలలో కనిపెట్టగలదు .
అడల్ట్స్ వెబ్సైట్ చూస్తే కనక మీ పని అవుట్
మీరేం చూస్తున్నారో facebook క్షణాలలో కనిపెట్టగలదు .
పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతూ తనని ఎవరు కనిపెట్టలేదని అనుకుంటుందట. అలాగే చాలామంది అడల్ట్స్ కంటెంట్ చూస్తున్నపుడు ఎవరికీ తెలియదు అనుకుంటే అటువంటి వారు పప్పు లో కాలేసినట్టే. అది ఎలా అంటే కొంతమంది అడల్ట్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతారు. అప్పుడు ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మారి, మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేసి , మీ ఇంటర్నెట్ ప్రైవసీ ఈజీగా కనిపెట్టే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
మీరు సెర్చ్ అడల్ట్ వెబ్‌సైట్స్ కి రిలేటెడ్ సెర్చ్ రిజల్ట్స్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితముగా మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి లాగవుట్ చెయ్యాలి. ఫేస్‌బుక్‌లో (porn-based malware) అనేది చాల ప్రమాదకరంగా మారింది. . ఈ డేంజరస్ మాల్వేర్ లింక్‌లు సెకన్స్ లో ఫేస్‌బుక్ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో ఫిల్ చేస్తాయి. ఆ తరువాత మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి ఎవరైనా ఫ్రెండ్ నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై తెలియక మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది. డౌన్‌లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్‌ను తమ కంట్రోల్ లోకి లాగేసుకుంటుంది. ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దీనికి బలౌవుతారు . " సో బి కేర్ ఫుల్ "
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile