ప్రముఖ Android Apps వినియోగదారుల సున్నితమైన డేటాని ఫేస్ బుక్ తో పంచుకుంటున్నాయి : రిపోర్ట్
ఈ నివేదిక, ఈ డేటా ఆప్ లాంచ్ సమయంలో అందించిన విశ్లేషణ డేటా మరియు ప్రత్యేక Android ID ని కలిగి ఉంటుందని చెబుతోంది. తర్వాత, మరింత సున్నితమైన డేటాను ఈ ఆప్స్ పంపిస్తున్నట్లు గుర్తించబడ్డాయి.
ముఖ్యాంశాలు:
1. ఆండ్రాయిడ్ పాపులర్ ఆప్ లలో "కనీసం" 20 ప్రముఖ Android ఆప్స్, వినియోగదారుల సమ్మతి లేకుండానే వారి సున్నితమైన సమాచారాన్ని పేస్ బుక్ కి చేరవేస్తున్నాయి.
2. ఈ ఆప్స్ Facebook డెవలపర్ కిట్ యొక్క పాత వెర్షన్లను ఉపయోగిస్తున్నాయి
3. కొన్ని ఆప్స్ వాటి వినియోగదారు డేటాను భాగస్వామ్యం చేస్తున్నట్లు వాటి డెవలపర్లకు కూడా తెలియదు
ముందుగా ఆరోగ్య మరియు డేటింగ్ ఆప్స్ వినియోగదారు సున్నిత డేటాను, Facebook తో పంచుకోవడం ద్వారా ఈ ఆప్ వినియోగధారు గోప్యతను భద్రపరచడాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించబడింది. ప్రయివసీ ఇంటర్నేషనల్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 34 ప్రముఖ Android ఆప్ లలో "కనీసం" 20 ఆప్స్ వినియోగదారు అనుమతి లేకుండా వారి సున్నితమైన డేటాను ఫేస్ బుక్ నకు పంపుతున్నారు. వీటిలో, Kayak, Skyscanner, MyFitnessPal మరియు TripAdvisor వంటివి కూడా ఉన్నాయి.
ఈ నివేదిక, ఈ డేటా ఆప్ లాంచ్ సమయంలో పంపిన విశ్లేషణ డేటా అలాగే ప్రత్యేక Android ID ని కలిగి ఉంటుందని చెబుతోంది. తర్వాత, మరింత సున్నితమైన డేటాను ఈ ఆప్స్ పంపిస్తున్నట్లు గుర్తించబడ్డాయి. Kayak, ప్రముఖ విమాన బుకింగ్ ఆప్, గమ్యం మరియు విమాన సెర్చ్ డేటా, ప్రయాణ తేదీలు మరియు ఎవరైనా పిల్లలతో ప్రయాణించనున్నారో లేదో అనే విషయాలను పంపడం చేస్తున్నట్లు గుర్తించబడింది.
అయితే, ఇది ఒక నిర్దిష్ట వినియోగదారుని నేరుగా గుర్తించడానికి షేర్ చేయబడలేదు అని చెప్పవచ్చు. కానీ ఈ డేటా, సిద్ధాంతపరంగా, పరోక్ష మార్గాల ద్వారా ఒకరిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆప్ ఇన్స్టాల్ చేసుకున్నవారు లేదా అదే వ్యక్తితో ప్రయాణిస్తున్నవారిని ఎవరైనా సులభంగా గుర్తించగలదు.
యూరప్ యూనియన్ యొక్క కఠినమైన గోప్యతా-ఆధారిత GDPR నిబంధనలను ఉల్లంఘించడం, వినియోగదారుల నుండి స్పష్టమైన అనుమతి తీసుకోకుండా డేటాను సేకరించడం ద్వారా ఇవి ఉల్లంఘనాలు చేస్తున్నట్లు కూడా చెప్పబడింది. వాస్తవానికి, ఫేస్ బుక్ డెవలపర్ కిట్, GDPR చట్టాలు అమలులోకి రాకముందు అందులో అనుమతి కోరడానికి ఎటువంటి ఎంపిక లేదు. కానీ ఈ నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఫేస్ బుక్ వినియోగదారుల అనుమతి కోసం కోరడానికి ఆప్ అనుమతించింది, కానీ ఎంతమంది డెవలపర్లు ఈ విషయం మీద ముందుకు వెళ్లి అమలు చేస్తారనేదాని పైన ఎటువంటి స్పష్టంగా లేదు. అయితే, ఈ పరిశోధన ద్వారా తెలిసినదేమిటంటే, డెవలపర్ కిట్ యొక్క పాత వెర్షన్లను ఉపయోగిస్తున్న అనేక ఆప్స్ ఉన్నట్లు గుర్తించబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వినియోగదారు అనుమతి లేకుండా డేటాను పంపుతున్నట్లు "తమకు కూడా తెలియదు" అని స్కైస్కానర్ చెప్పినట్లు, నివేదిక పేర్కొంది.
ఇప్పుడు పేస్ బుక్, ఒక "క్లియర్ హిస్టరీ" ఎంపిక కోసం పని చేస్తుంది మరియు ఆఖరికి డెవలపర్లు ఆటోమాటిక్ డేటా సేకరణ ఎంపికను, ఆపివేయడాన్నీ ఎంపిక చేసుకునేలా, ఇది ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికీ, పేస్ బుక్ యొక్క వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి ఇది మరొక ఉదాహరణ. ఈ సందర్భంలో, ఆప్ డెవలపర్లు మారుతున్న నిబంధనలకు అనుగుణంగా, తాజాగా ఉంచకుండా మరియు వినియోగదారు గోప్యత గురించి వచ్చిన కొత్తగా వచ్చిన నియమాలను స్వీకరించడంలో విఫలమైనందుకు ఈ ఆప్స్ దోషాలను కలిగివున్నాయి.