Poco Pad 5G: ఎట్టకేలకు ఇండియాలో పోకో ప్యాడ్ 5జి ని విడుదల చేసింది. ఈ కొత్త ప్యాడ్ ని డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ప్యాడ్ లో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నట్లు కూడా పోకో వెల్లడించింది. పోకో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ సరికొత్త ప్యాడ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
పోకో ప్యాడ్ 5జి బేసిక్ వేరియంట్ (8GB + 128GB) (wi-fi + 5G) ని రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) (wi-fi + 5G) ని రూ. 25,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ ను బ్యాంక్ మరియు ఇతర డిస్కౌంట్ ఆఫర్లతో రూ. 19,999 ఆఫర్ ధరకే పొందవచ్చని పోకో తెలిపింది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ప్యాడ్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది.
పోకో ప్యాడ్ 5జి ని 12.1 ఇంచ్ పెద్ద స్క్రీన్ ను 2.5K పిక్సెల్ రిజల్యూషన్ తో అందించింది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ స్క్రీన్ అద్భుతమైన విజువల్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. పోకో ప్యాడ్ 5జి ని Snapdragon Gen 2 చిప్ సెట్ మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది.
ఈ ప్యాడ్ లో వెనుక 8MP సింగల్ రియర్ కెమెరా సెటప్ ఫ్లాష్ లైట్ తో జతగా ఉంటుంది. ఈ ప్యాడ్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ప్యాడ్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ ను కలిగి ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ ప్యాడ్ ను అతి భారీ `10,000 mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.
Also Read: జబర్దస్త్ QLED TV ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 28 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఈ ప్యాడ్ పోకో స్మార్ట్ పెన్ మరియు పోకో కీబోర్డు లకు సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇందులో హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ ఫీచర్ ఉన్నట్లు కూడా పోకో తెలిపింది.