నరేంద్ర మోడీ USA వెళ్లారు అని అందరికీ ఇప్పటికే బాగా తెలిసింది. కారణం ఫేస్ బుక్ లో డిజిటల్ ఇండియా అని పోస్ట్స్ అండ్ ప్రొఫైల్ పిక్స్ ను మార్చటం. అయితే డిజిటల్ ఇండియా అంటే ఏంటి..ఎందుకు..అనే క్లారిటీ మాత్రం కొంతమందికి లేదు..అసలు మోడీ usa వెళ్లి ఏమి చేశారు…
డిజిటల్ ఇండియా అనేది.. ఇండియా అంతా డిజిటల్ గా బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నడుస్తున్న కాంపెయిన్. డిజిటల్ అభివృద్ధి అంటే సిటీ, villages అనే తేడాలు లేకుండా ఇండియా అంతా ఇంటర్నెట్ విరివిగా అందుబాటులో ఉండాలి, అందరూ వాడాలి అని. ఇదే ఫేస్ బుక్ సీఈఓ చేస్తున్న internet.org ప్రాజెక్ట్.
మోడీ usa లో ఆపిల్, క్వాల్ కామ్, గూగల్, adobe, Cisco, ఫేస్ బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీల సీఈఓ లతో కొన్ని మంతనాలు జరిపి, డిజిటల్ ఇండియా కాంపెయిన్ కు వాళ్ల సహకారాలు అందేలా చేశారు.
నిన్న ఫేస్ బుక్ కార్యాలయంలో మోడీ డిజిటల్ ఇండియా కాంపెయిన్ ద్వారా తన ప్లాన్స్ ను అందరికీ వివరించారు. అలానే తను ఇండియాలో పెరిగిన పరిస్తితులను పంచుకున్నారు. ఇప్పుడు డిజిటల్ ఇండియాకు అవే కారణం అని చెప్పుకున్నారు.
ఇదే పర్యటనలో సిలికాన్ వేలీ లో ఉన్న సీఈఓ లతో మాట్లాడుతూ… " ఒకే రూఫ్ క్రింద ఉండి ఏదైనా మార్పులను తీసుకు రాగలము అంటే అది ఇదే! ఇప్పుడు మనం పడుకుని ఉన్నామా.. లేచి ఉన్నామా అనేది కాదు.. ఆఫ్ లైన్ లో ఉన్నామా.. ఆన్ లైన్ లో ఉన్నామా అనేది ప్రధానమైన విషయం. యూత్ లో ఎక్కువుగా వినిపించే డిబేట్… ఆండ్రాయిడ్, ios అండ్ విండోస్ os ల మధ్య ఏది ఎంచుకోవాలి అనేదే వినిపిస్తుంది." అని ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగల్ వంటి సీఈఓ లు ఉన్న మీటింగ్ లో మాట్లాడారు.
డిజిటల్ ఇండియా అనే పేరుతో మోడీ ఇంతవరకూ ఇండియా కు తెచ్చిన వాటిలో కొన్ని..
గూగల్ 500 రైల్వే స్టేషన్స్ కు దేశం అంతటా కొత్త వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటి అందించటానికి ముందుకు వచ్చింది. ఇది 2016 నుండి మొదలవుతుంది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ళ .. ఇండియన్ govt తో కలిసి అతి తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటి ను అందించటానికి ఒప్పుకున్నారు. 5 లక్షల గ్రామాల కు ఇది వర్తిస్తుంది.
దీనితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఇంటలిజెన్స్ వంటి డేటా క్రియేటివిటి, efficiency మరియు ప్రోడక్ట్విటీ ఆధారం గా govt అండ్ బిజినెస్ లకు కొత్త గ్లోబల్ oppurtunities వస్తాయి.
క్వాల్ కామ్ కూడా ఇండియన్ చిన్నా పెద్దా అన్నీ స్టార్ట్ అప్ లకు 150 మిలియన్ డాలర్స్ ను ఇన్వెస్ట్ చేస్తుంది. స్టార్ట్ ఆప్స్ అంటే ఒక ఐడియా ను ప్రాక్టికల్ గా work out చేయటం.
దీనికి కావలసిన ఫైనాన్స్ కోసం ఆన్ లైన్ లో అందరినీ అడగటమే. ఇప్పుడు ఇది ఇండియాలో బాగా హాట్ టాపిక్. మోడీ వీటిని బాగా encourage చేశారు. స్టార్ట్ ఆప్స్ కు అంత డిమాండ్ ఎందుకు అంటే, ఇప్పుడు మీరు వాడుతున్న ఫ్లిప్ కార్ట్, ఫుడ్ పాండా, రెడ్ బస్ మరెన్నో సక్సెఫుల్ సర్వీస్ లన్నీ అలా వచ్చినవే.