Pig butchering Scam: ప్రస్తుతం దేశంలో అతిగా విస్తరిస్తున్న స్కామ్ గా అవతరిస్తోంది. దేశంలో ఈ స్కామ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రజలు ఎక్కువగా నివసించే సోషల్ మీడియా యాప్స్ ను టార్గెట్ చేసుకుని ఈ స్కామ్ పని చేస్తుంది. ఈ కొత్త స్కామ్ ను ‘పిగ్ బుచరింగ్ స్కామ్’ లేదా ‘ఇన్వెస్ట్మెంట్ స్కామ్’ అని కూడా పిలుస్తారు. ఈ స్కామ్ గురించి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అందించిన యాన్యువల్ రిపోర్ట్, అందరిని నివ్వెరపరిచే నెంబర్ తో వుంది.
యూనియన్ హోమ్ మినిస్ట్రీ వెల్లడించిన లెక్కల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై March 2024 నాటికి భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో, 14,746 కేసులు వాట్సాప్ పై, 7651 కేసులు టెలిగ్రామ్ పై, 7,152 కేసులు ఇన్స్టాగ్రామ్ పై, 7,051 కేసులు ఫేస్ బుక్ పై మరియు 1,135 కేసులు యూట్యూబ్ పై నమోదు అయ్యాయి. ఈ లెక్కలు చూస్తుంటే మనకు అర్థం అవుతుంది ఈ కొత్త స్కామ్ ఏ రీతిగా విస్తరిస్తోందో అని.
పందిని వధించే ముందు అది బాగా కొవ్వెక్కే వరకు మేపుతారు, ఆ తర్వాత దాన్ని వదిస్తారు, దీన్నే బుచరింగ్ అంటారు. ఈ స్కామ్ కూడా దాదాపుగా ఇలాంటిదే కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది మరియు 2016 లో ఈ స్కామ్ మొదటిగా చైనా లో గుర్తించబడింది. ఈ స్కామ్ లో స్కామర్లు గూగుల్ యొక్క అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్ ను ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తారు.
అంతేకాదు, స్కామర్లు వాట్సాప్, టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ మరియు స్కీములు ప్రమోట్ చేస్తారు. ఈ యాడ్స్ ద్వారా మంచి లాభాలు అందించే క్రిప్టోకరెన్సీ యాప్స్ లేదా స్కీమ్స్ అంటూ నమ్మిస్తారు. ఒక్కసారి నమ్మి ఈ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మొత్తంగా దోచేస్తారు.
ఇందులో ముందుగా భారీ లాభాలు చూపించి ఎప్పుడైతే ఎక్కువ మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేస్తారో మొత్తం దోచేస్తారు. అందుకే, ఈ స్కామ్ కు పిగ్ బుచరింగ్ స్కామ్ అని పేరొచ్చింది. అందుకే, ఇటివంటి స్కామ్స్ ని నిలువరించడానికి ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గూగుల్ మరియు ఫేస్ బుక్ సహకారంతో ఇటివంటి స్కామ్స్ అరికట్టడానికి రియల్ టైం మోనిటరింగ్ చేస్తుంది.
Also Read: Oppo Reno 13 Series Launch డేట్ అనౌన్స్ చేసిన ఒప్పో.. లాంచ్ ఎప్పుడంటే.!
అయితే, ఇటువంటి స్కామ్స్ ను అరికట్టాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు మంది కూడా వుంది. అందుకే, తర్డ్ పార్టీ లేదా అనధికార యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకునే ముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం మంచిది.