Phone Hack Check: ఫోన్ హ్యాక్ అయ్యిందని డౌటా..ఇవి చెక్ చెయ్యండి.!
స్కామర్లు ప్రజలను మోసం చెయ్యడానికి స్మార్ట్ ఫోన్ ను ఆయుధంగా మార్చుకుంటున్నారు
స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినట్లుగా యూజర్లు ముందుగా పసిగడితే జాగ్రత్త పడే వీలుంటుంది
Phone Hack Check అంచనా వేయడానికి అనుసరించ తగిన విషయాలు
Phone Hack Check: అరచేతిలో ప్రపంచాన్ని చుట్టేసే యంత్రం స్మార్ట్ ఫోన్. అందుకే, స్కామర్లు ప్రజలను మోసం చెయ్యడానికి స్మార్ట్ ఫోన్ ను ఆయుధంగా మార్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేసి యూజర్ల అకౌంట్ లను లేదా వారి పర్సనల్ డేటా లను కోల్ల గొట్టిన ఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. అయితే, స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయినట్లుగా యూజర్లు ముందుగా పసిగడితే మాత్రం ఈ అనర్ధాన్ని జరగకుండా చూసుకునే వీలుంటుంది.
అందుకే, స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదా అంచనా వేయడానికి అనుసరుంచ దగిన ముఖమైన విషయాలను గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు ఎటువంటి ప్రత్యేకమైన యాప్స్ లేదా సైట్ ను ఓపెన్ చేయవలసిన పని లేదు. రోజువారి మీ స్మార్ట్ ఫోన్ వాడుకలో వచ్చే చిన్న చిన్న మార్పులతోనే ఈ విషయాన్ని కనిపెట్టవచ్చు. ఆ చిన్న చిన్న విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Phone Hack Check
మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ లో కొన్ని లక్షణాలు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లు మీరు డౌన్ పడవచ్చు. ముందుగా, మీ స్మార్ట్ ఫోన్ నార్మల్ గా కాకుండా వింతగా ప్రవరిస్తున్నా లేదా ఒక్కసారిగా ఫోన్ చాలా స్లోగా మారితే మీరు డౌన్స్ ను వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్ బ్యాగ్రౌండ్ లో మీకు తెలియకుండా ఏదైనా యాప్స్ లేదా వైరస్ రన్ అయ్యే సమయంలో ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
ఇక మీరు పరిశీలించ వలసిన రెండవ విషయం మీ ఫోన్ బ్యాటరీ. ఈ స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ సాధారణ సమయంకంటే చాలా వేగంగా డ్రైన్ అవుతున్నా మీరు డౌట్ పడవచ్చు. అంటే, మీరు మీ ఫోన్ ను ఉపయోగించక పోయినా మీ ఫోన్ లో బ్యాటరీ అయిపోవడం వంటి విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి.
Also Read: Big Deal: భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న బ్రాండెడ్ 65 ఇంచ్ QLED Smart TV.!
అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, మీ ఫోన్ డేటా వేగంగా అయిపోవడం. ఆన్లైన్ లో పని చెయ్యాలన్నా దానికి డేటా అవసరం అవుతుంది. ఒకవేళ మీ ఫన్ హ్యాక్ అయితే కూడా బ్యాక్ డ్రాప్ లో యాప్స్ రాం చేయడానికి లేదా ఇతర పనులను చేయడం వంటి అన్ని పనులకు డేటా అవసరం అవుతుంది. కాబట్టి, మీరు మీ ఫోన్ ను మాములుగా వాడినా లేక ఫోన్ ను అసలు ఉపయోగించక పోయినా సరే మీ ఫోన్ డేటా అయిపోతున్నా మీరు డౌట్ పడవచ్చు.
ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా?
అవును మీ పెర్ఫార్మెన్స్ షడన్ గా తగ్గినా పోయినా కూడా మీ ఫోన్ అయిందేమో అని మీరు అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఎందుకంటే, సాధారంగా ఫోన్ ను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే ఫోన్ పెర్ఫార్మెన్స్ లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, షడన్ గా ఫోన్ హ్యాంగ్ అవ్వడం లేదా పెర్ఫార్మెన్స్ ఒక్కసారిగా తగ్గిపోవడం వంటి విషయాలు కూడా అనుమానాలకు దారితీస్తాయి.
అంతేకాదు, మీ ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ వాటంతట అవే క్లోజ్ అవుతున్నా కూడా మీరు జాగ్రత్త వహించాలి.
మరి ఏమి చెయ్యాలి?
ముందుగా మీ స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా ఫార్మాట్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలి. ఆతరువాత మీ ఫోన్ లో మంచి Antivirus ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ ను సురక్షితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ ఫోన్ తో పాటే ఏదైనా యాంటీ వైరస్ ఇన్ బిల్ట్ గా వస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు.