పాన్ కార్డు పొందటం ఇప్పుడు నిముషాలలో పని

Updated on 17-Feb-2017
HIGHLIGHTS

పాన్ పొందాల‌నుకుంటున్న వారికి సుల‌భంగా ఆ నెంబ‌రు అందుబాటు.

పాన్ కార్డు పొందటం ఇప్పుడు నిముషాలలో  పని 

పాన్ పొందాల‌నుకుంటున్న వారికి సుల‌భంగా ఆ నెంబ‌రు అందుబాటు. 

ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారా పాన్ నంబర్‌కు అప్లై  చేసుకున్నవారి అడ్రస్ , పుట్టిన తేదీని బయోమెట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని, తద్వారా నిమిషాల్లో పాన్ నంబర్‌ను జారీ చేయవచ్చని చెప్పారు, మొబైల్ యాప్‌ ద్వారా పన్ను చెల్లింపులే కాకుండా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, రిటర్న్‌లు ట్రాక్‌ చేసుకునే వీలు కల్పించ‌నున్నామ‌ని పేర్కొన్నారు. 
సిమ్ కార్డు జారీ చేయ‌డానికి ఉప‌యోగిస్తోన్న ప్ర‌క్రియ‌నే తాము పాన్ కార్డు జారీకి అనుసరించనున్నట్టు సమాచారం . స్మార్ట్‌ఫోన్ ద్వారా టాక్స్  payings  ను  ప్రోత్స‌హిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) అందించాలని భావిస్తోంది. 
దీనిగూర్చి ఇంకా పూర్తి  సమాచారం  వెలువడలేదు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :