PAN మరియు Aadhaar లింక్ డెడ్ లైన్ పొడిగించిన కేంద్రం..!

PAN మరియు Aadhaar లింక్ డెడ్ లైన్ పొడిగించిన కేంద్రం..!
HIGHLIGHTS

PAN మరియు Aadhaar లింక్ డెడ్ లైన్ పొడిగించిన కేంద్రం

పాన్ మరియు ఆధార్ ను లింక్ చేయ్యడంలో విఫలమైన వారికి కేంద్రం మరొక అవకాశం అందించింది

ఆధార్-పాన్ లింక్ చెయ్యని వారి పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది

PAN మరియు Aadhaar లింక్ డెడ్ లైన్ పొడిగించిన కేంద్రం. మార్చి 31 లోపుగా పాన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారి ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ ను లింక్ చెయ్యాలని కేంద్రం మార్చి 31 ని డెడ్ లైన్ గా విధించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు కేంద్రం ఈ డెడ్ లైన్ ను మరొకసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ పాన్ మరియు ఆధార్ ను లింక్ చేయ్యడంలో విఫలమైన వారికి కేంద్రం మరొక అవకాశం అందించింది. వాస్తవానికి, ఇప్పటికే పలుమార్లు పాన్ -ఆధార్ లింక్ కోసం కేంద్రం విధించిన డెడ్ లైన్ లో మార్పులు చేసింది.

ముందుగా, మార్చి 31 లోపల ఆధార్ తో పాన్ లింక్ చేయ్యని వారి PAN Card ఇన్ యాక్టివ్ అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఈ గడువును ఇప్పుడు జూన్ 30 వరకూ పొడిగించి ప్రజలకు వెసులుబాటును కల్పించింది. పాన్ మరియు ఆధార్ లింక్ చేయకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? గడువు ముగిసే లోపుగా ఆధార్-పాన్ లింక్ చెయ్యని వారి పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. అంటే, మీ పాన్ తో లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ స్తంభించి పోతుంది. 

అందుకే, గడువు లోపుగా PAN Card కలిగిన ప్రతిఒక్కరూ కూడా విధిగా వారి ఆధార్ తో లింక్ చెయ్యాలని కేంద్రం చెబుతోంది. మీరు ఇప్పటి వరకూ మీ పాన్-ఆధార్ లీనిక్ చెయ్యకుంటే ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో క్రింద చూడవచ్చు. అయితే, పాన్ ఆధార్ లింక్ కోసం 1,000 రూపాయల ఫైన్ మీరు కట్టవలసి ఉంటుంది.

పాన్-ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా చెక్ చెయ్యండి   

ముందుగా, https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ కి వెళ్ళాలి. తరువాత Link Aadhaar పైన నొక్కండి మరియు కొత్త పేజ్ వన్ అవుతుంది. ఇక్కడ PAN క్రింద ఉన్న బాక్స్ లో పాన్ నంబర్, Aadhaar Number క్రింద ఉన్న బాక్సులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న 'Validate' పైన నొక్కండి. ఒకవేళ మీ ఆధార్-పాన్ లింక్ అయ్యి ఉంటే, మీకు లింక్ అయినట్లు చూపిస్తుంది. ఒకవేళ లింక్ అవ్వకుంటే తరవాతి వివరాల్లోకి తీసుకు వెళుతుంది. ఇక్కడ 'Continue to pay through e-pay Tax' అని సూచిస్తుంది. అంటే, మీ పాన్-ఆధార్ లింక్ అవ్వలేదని అర్ధం.

 

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo