PAN 2.0 Approved: ఇక నుంచి QR Code తో పాన్ కార్డ్.. కొత్త నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.!
ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కోసం కొత్త నిర్ణయం తీసుకుంది
PAN 2.0 కార్డు కోసం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది
పాన్ కార్డు స్థానంలో QR Code తో కొత్త పాన్ కార్డ్ ను అందించనుంది
PAN 2.0 Approved: ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కోసం కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరికి అవసరమైన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కార్డు కోసం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం ఫోటో అకౌంట్ నెంబర్ మరియు వివరాలతో మాత్రమే అందించిన పాన్ కార్డు స్థానంలో QR Code తో కొత్త పాన్ కార్డ్ ను అందించనుంది.
PAN 2.0 Approved:
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కార్డు ను ఇప్పుడు మరింత సెక్యూర్ మరియు ఈజీ స్కాన్ పద్ధతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త అప్డేట్ తో పాన్ కార్డ్ ను మరింత సెక్యూర్ మరియు ఈజీ స్కాన్ పద్ధతిలోకి మారుస్తుంది. దీనికోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ (CCEA) ఈ ప్రోజెక్ట్ ను ఆమోదించింది. అంతేకాదు, ఈ ప్రోజెక్ట్ కోసం రూ. 1,435 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయించింది.
ఏమిటి కొత్త PAN 2.0?
ఈ కొత్త పాన్ 2.0 అనేది చాలా కాలంగా కొనసాగుతున్న సాంప్రదాయ PAN/TAN కి అప్గ్రేడ్ వెర్షన్. టాక్స్ పేయర్స్ కి డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ను అందించడానికి తగిన విలువలతో ఈ కొత్త సిస్టం ను తీసుకు వచ్చింది. టాక్స్ పేయర్స్ రిజిస్ట్రేషన్ సర్వీసుల కోసం ఇది ఒక e-governance సహాయం గా ఉంటుంది.
PAN 2.0 ఏమిటి లాభం?
ఈ కొత్త పాన్ 2.0 తో టాక్స్ పేయర్స్ కి డిజిటల్ యాక్సెస్ అందిస్తుంది. ఈ కొత్త అప్గ్రేడ్ పాన్ సంబంధిత యాక్టివిటీస్ మరియు పాన్ వాలిడేషన్ సర్వీస్ రెండింటిని కూడా కొత్త టెక్ ద్వారా నడిపిస్తుంది. ఈ కొత్త అప్గ్రేడ్ డిజిటల్ ఇండియాలో భాగంగా అందించింది మరియు ఇది డిజిటల్ ఇండియా కి సపోర్ట్ చేస్తుంది.
Also Read: boAt Airdopes Loop: కొత్త రకం ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసిన బోట్.!
QR Code PAN
ఇక నుంచి కొత్త పాన్ కార్డు QR Code తో వస్తాయి. ఇవి అన్ని గవర్నమెంట్ మరియు బ్యాంక్ సర్వీస్ లతో పాటు కామన్ ఐడెంటిఫైయర్ లాగా కూడా ఉంటుంది. అంటే, పాన్ కార్డ్ ఇప్పుడు జస్ట్ స్కాన్ చేసి వివరాలు పొందే కామన్ ఐడెంటిటీ కార్డు గా కూడా ఉపయోగపడుతుంది.