Google Play Awards 2018 లో మీకు నచ్చిన APP మరియు Game ని గెలిపించడం కోసం మీరు VOTE చేయవచ్చు

Updated on 14-Nov-2018
HIGHLIGHTS

గూగుల్ 'ఫ్యాన్ ఫేవరేట్' కేటగిరీలను జతచేసింది మరియు 2018 సంవవత్సరంలోని వారి అభిమాన APP మరియు Game కోసం ఓటు వేయమని వినియోగదారులను అడుగుతోంది.

Google ప్రతి సంవత్సరం ఉత్తమ అప్స్ మరియు గేముల జాబితాను విడుదల చేస్తుంది.  కానీ ప్రస్తుతం, Google Play స్టోర్లో తమకు నచ్చినవాటికి ఓటు వేయడానికి కూడా Android వినియోగదారులను  కోరుతున్నారు. ఈ సంస్థ యొక్క సంవత్సరాంతపు పురస్కారాలు ఇప్పుడు ఇంటరాక్టివుగా ఉంటాయి, ఎందుకంటే అది దాని "బెస్ట్ ఆఫ్ ప్లే" వార్షిక అనువర్తన అవార్డుల జాబితాలో కొత్త 'Fan  Favorite' కేటగిరీలను జోడించింది. ఈ సంస్థ యొక్క ప్రెస్ ప్రకటనలో వినియోగదారులు ఈ సంవత్సరపు ఉత్తమమైనదని భావిస్తున్న చలన చిత్రం కోసం ఓటు వేసే ఎంపికను పొందుతారని పేర్కొన్నప్పటికీ, ఈ ఎంపికను రాతపూర్వకంగా ఇవ్వలేదు.

ఓటు వేయడానికి, వారి Android- ఆధారిత ఫోనులోవున్న  ప్లే స్టోర్ అనువర్తనం నుండి చేయవచ్చు లేదా ఇక్కడ ఇచ్చిన Webpage ద్వారా కూడా చేయవచ్చు.  నవంబర్ 26, 2018 తేదీన ఓటింగు చేయడానికి చివరిరోజు అని గుర్తుంచుకోండి మరియు ఫ్యాన్ ఫేవరేట్ విజేతలు, 2018 పిక్స్ యొక్క ఉత్తమ జాబితాతో పాటు డిసెంబర్ 3, 2018 న ప్రకటన జరుగుతుంది.

గేమ్స్ చాలా ఉన్నప్పటికీ, ఒకరు ఓటు వేయగల గేమ్స్ మరియు ఆప్స్ సంఖ్యను పరిమితం చేశారు. అదనంగా, ఒక వ్యక్తి ఒక కేటగిరికి ఓటు వేయవచ్చు. ఆ తరువాత, వారు ఎంచుకున్న ఆప్ లేదా గేమ్ ఏస్ధానములో ఉన్నదనే విషయాన్నీ వారు చూడగలరు. గేమ్స్ గురించి మాట్లాడుతూ, PUBG, క్లాష్ రాయల్, హిల్ క్లైంబింగ్ రేసింగ్ 2 మరియు కొన్నిఇతర గేమ్స్ ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఆప్స్  విషయానికివస్తే, Google Pay కోసం ఓటు వేయదానికి, మై  ట్రైన్ మరియు ఇంకాచాలా ఇతర ఆప్స్ పోటీలోవున్నాయి. అలాగే  Gaana, Hotstar మరియు Zee 5 లు కూడా ఈ జాబితాలో, గూగుల్ ఆప్స్ మరియు గేమ్స్  ఓటింగ్ కోసం స్థానికంగా ఉంచిందని తెలుస్తోంది.

గత ఏడాది, రెడ్ బుల్ టీవీ ఉత్తమ టీవి ఎక్స్పీరియన్స్ అవార్డును గెలుచుకుంది, ఉత్తమ VR మరియు AR ఎక్స్పీరియన్స్ పురస్కారాలు వర్చువల్ రియాలిటీ మరియు Woorld వరుసగా గెలుచుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్స్: Forged To Fight  ఉత్తమ గేమ్ యొక్క పురస్కారం గెలుచుకుంది, ఉత్తమ మల్టీప్లేయర్ గేమ్ అవార్డు, బ్లిజార్డ్ ఎంటర్టైన్మెంట్ యొక్క, Hearthstone కి వెళ్ళింది. గత సంవత్సరం విజేతల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :