ఒప్పో నుండి విడిపోనున్న రియల్ మీ: ఇండియా ప్రధాన అధికారి అయిన స్కై లీ విడిచిపెట్టడమే ఇందుకు కారణం
స్కై లీ ఇప్పుడు రియల్ మీ కి గ్లోబల్ సీఈవో గా ఉన్నారు. ఇకనుండి కంపెనీ యువత - ఆధారిత ఫోన్ల మీద ద్రుష్టి సారించనుందని మరియు బలమైన పనితీరును మరియు స్టైలిష్ డిజైన్ తో కూడిన సరసమైన డివైజ్ లను అందించనుందని ఆయన చెప్పారు.
స్కై లీ ,ఫార్మర్ వైస్ ప్రసిడెంట్ అఫ్ ఇండియా మరియు హెడ్ ఆఫ్ ఒప్పో ఇండియా గా ఉన్నటువంటి , ఈయన ఈ కంపెనీ నుండి అధికారకంగా రాజీనామా చేసినట్లు మరియు అదేసమయంలో మే నెలలో ఒప్పో విడుదల చేసిన ఆన్లైన్ -ఎక్సక్లూసివ్ ఉప – బ్రాండ్ అయినటువంటి రియల్ మీ కి గ్లోబల్ సీఈవో గా పగ్గాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇకనుండి కంపెనీ యువత – ఆధారిత ఫోన్ల మీద ద్రుష్టి సారించనుందని మరియు బలమైన పనితీరును మరియు స్టైలిష్ డిజైన్ తో కూడిన సరసమైన డివైజ్ లను అందించనుందని ఆయన తెలియచేసారు .
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులు వేర్వేరు సెల్ ఫోన్ అలవాట్లు మరియు కళాత్మక దృక్పథాలను కలిగి ఉండవచ్చు కానీ పెర్ఫార్మన్స్ మరియు డిజైన్ పరంగా వారి డిమాండ్లు ఒకే విధంగా ఉన్నాయి.ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదారుల డిమాండుకు కొన్ని ఎంపికలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నఈ ఖాళీని , రియల్ మీ బలమైన పనితీరు మరియు స్టైలిష్ డిజైన్లతో పాటు తాజా సాంకేతిక ఆవిష్కరణలతో ఉత్పత్తులను అందించడం ద్వారా దానిని భర్తీ చేసే విషయం మీద దృష్టి పెడుతుంది. ప్రపంచ మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్న రియల్ మీ, ప్రపంచ స్మార్ట్ఫోన్ పరిశ్రమలో తాజాగా ఊపునందిస్తుందని "స్కై లీ ఒక స్టేట్ మెంట్ లో తెలిపారు.
ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం,లీ కొత్త బ్రాండ్ ని పరిచయంచేస్తూ రియల్ మీ ఉద్యోగులకు ఒక లేఖ వ్రాసాడు. "ఒప్పో ను అధికారికంగా వదిలి వెళ్ళే ముందు, గత కొన్ని సంవత్సరాలలో నేను ఒప్పో యొక్క గ్లోబల్ ఓవర్ సీస్ మార్కెట్ కి బాధ్యత వహించాను. యువతరం నుండి అధిక ప్రతిస్పందన మరియు నమ్మకం నాకు కొత్త బ్రాండ్ రియల్ మీ ని ప్రారంభించటానికి ప్రోత్సహించాయని " లీ ఈ లెటర్ లో రాసారు. ఈ కార్యనిర్వాహణాధికారి మూడు మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉన్న వ్యాపారాన్ని ,31 దేశాలు మరియు ప్రాంతాలకు ఒప్పో ను విస్తరించే విధం గా చేసారు, వీటిలో ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు ఓషియానియా కూడా వున్నాయి.అనేక దేశాల్లో టాప్ మూడు స్మార్ట్ ఫోన్ కంపెనీలలో ఇప్పుడు ఒప్పో కూడా ఉంది.