Oppo Reno11 Series భారత మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మొదలుపెట్టిన ఒప్పో, ఈ ఫోన్స్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించ లేదు. ఈ ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ‘Launching Soon’ బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కెమేరా ప్రత్యేకంగా తీసుకు వస్తున్నట్లు మరియు మరిన్ని ఇతర ఫీచర్లను కూడా ఇందులో అందించే అవకాశం కూడా ఉండవచ్చు.
ఒప్పో రెనో11 సిరీస్ ను The Portrait Expert క్యాప్షన్ తో ఒప్పో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుందని అర్ధమవుతోంది. అలాగే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అవుతోంది. ఈ ఫోన్ టీజింగ్ లో భాగంగా ఈ ఫోన్ లో అందించిన కెమేరా సెటప్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ అందించింది.
ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుందని అర్ధం అవుతోంది. ఈ పేజ్ ద్వారా ఒప్పో అందించిన ఈ అప్ కమింగ్ స్పెక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read : Dolby Atmos Sound bar పైన అమేజాన్ ధమాకా ఆఫర్.!
ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 50MP OIS మెయిన్ + 32 MP అల్ట్రా వైడ్ + 32 MP అల్ట్రా క్లియర్ కెమేరా (Sony IMX709) ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ తో చిత్రికరించినట్లు చెబూతూన్న కొన్ని శాంపిల్ ఫోటోలను కూడా ఫోన్ లాంచ్ టీజర్ పేజ్ నుండి షేర్ చేసింది ఒప్పో.
ఈ ఫోటోలను చూస్తుంటే ఒప్పో రెనో11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను మంచి కెమేరా సెటప్ తో తీసుకు వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఇమేజెస్ ద్వారా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్, కర్వ్డ్ డిస్ప్లే మరియు పంచ్ హోల్ డిజైన్ తో సెల్ఫీ కెమేరా సెటప్ ను కలిగి ఉన్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫోన్ లలో 80W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది.