OPPO: రూ.1,799 ధరకే డాల్బీ అట్మోస్ తో ట్రూ వైర్ లెస్ బడ్స్ తెచ్చిన ఒప్పో..!!

Updated on 27-Aug-2022
HIGHLIGHTS

ఒప్పో ఇండియాలో కొత్త OPPO Enco Buds2 ను విడుదల చేసింది

Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపో

10mm టైటానైజ్డ్ స్పీకర్లతో మెరుగైన BASS ను మీకు అందిస్తుందని కంపెనీ తెలిపింది

ఒప్పో ఇండియాలో కొత్త  ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ OPPO Enco Buds2 ను విడుదల చేసింది. కేవలం రూ.1,799 రూపాయల ధరలో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ కొత్త వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ అందించడం విశేషం. అంతేకాదు, ఈ ఎన్కో బడ్స్ 2 మెరుగైన బాస్ పెర్ఫామెన్స్ తో కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. మరి ఒప్పో భారతీయ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ ఎలా ఉన్నదో చూద్దామా.

OPPO Enco Buds2  లను మీరు OPPO స్టోర్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో నుండి 31 ఆగస్టు 2022 నుండి పొందవచ్చు. ఈ బడ్స్ ను ఒప్పో రూ.1,799 రూపాయల ధరతో అందించింది. ఈ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ పెద్ద 10mm టైటానైజ్డ్ స్పీకర్లతో వస్తుంది మరియు మెరుగైన BASS ను మీకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో అందించిన స్పీకర్ల పైన పోసిన డయాఫ్రాగమ్ పూత ద్వారా మరింత బ్యాలెన్స్ సౌండ్ ను అందిస్తుందని కూడా కంపెనీ పేర్కొంది.

ఈ TWS  ఒరిజినల్ సౌండ్, Bass Boost బూస్ట్ మరియు క్లియర్ వోకల్స్ వంటి మూడు రకాల సెట్టింగ్‌ లను కలిగి ఉన్న Dolby Atmos తో పాటు OPPO యొక్క యాజమాన్య ఎన్కో లైవ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఇవి తేలికైనవి మరియు IPX4 రేటింగ్ తో చెమట మరియు తుంపర్ల నుండి రక్షణ అందిస్తుంది. ఈ బడ్స్ పూర్తి చార్జింగ్ తో 7 వరకూ ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇక ఛార్జింగ్ కేస్ ను కూడా కలుపుకుంటే 28 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుంది.

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ TWS తక్కువ-లేటెన్సీ బ్లూటూత్ 5.2 ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, ఇది స్థిరమైన కనెక్టివిటీని అందిస్తుంది. అంటే, గేమింగ్ సమయాల్లో కూడా సంప్రదాయమైన హెడ్ ఫోన్ మాదిరిగా ఎటువంటి జాప్యం లేని గేమింగ్ అనుభూతిని పొందవచ్చని దీని అర్ధం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :