Oppo Air Glass 3: వాయిస్ అసిస్టెంట్ తో పనిచేసే కొత్త AR కళ్ళ జోడును పరిచయం చేసిన ఒప్పో.!
MWC 2024 నుండి ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త ప్రోడక్ట్ ను ఆవిష్కరించింది
AR Glass ప్రోటో టైప్ ను ఒప్పో ఈవెంట్ నుండి ఆవిష్కరించింది
ఒప్పో కొత్త AR కళ్ళజోడు ఎయిర్ గ్లాస్ 3 చాలా అందమైన లుక్స్ తో కనిపిస్తోంది
Oppo Air Glass 3: స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న MWC 2024 నున్నాయి అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్స్ ను ఎక్స్ పోజ్ చేసే పనిలో పడ్డాయి. ఈ అతిపెద్ద టెక్ ఈవెంట్ నుండి ప్రముఖ బ్రాండ్ ఒప్పో తన కొత్త ప్రోడక్ట్ ను ఆవిష్కరించింది. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న అగ్యుమెంట్ రియాలిటీ గ్లాస్ యొక్క ప్రోటో టైప్ ను ఒప్పో ఈ ఈవెంట్ నుండి ఆవిష్కరించింది. ఎయిర్ గ్లాస్ పేరుతో పరిచయం చేసిన ఈ AR కళ్ళ జోడు విశేషాలను కూడా షేర్ చేసింది.
Oppo Air Glass 3:
ఒప్పో కొత్త AR కళ్ళజోడు ఎయిర్ గ్లాస్ 3 చాలా అందమైన లుక్స్ తో కనిపిస్తోంది మరియు సాధారణ కళ్ళ జోడు మాదిరిగా అందించింది. ఈ ఎయిర్ గ్లాస్ 3 ని కళ్ళకు ధరించగానే ఒప్పో ఎయిర్ గ్లాస్ అని ఓపెన్ అవుతుంది మరియు బ్యాటరీ వివరాలను చూపిస్తుంది. ఈ ఎయిర్ గ్లాస్ 3 ని ఒప్పో యాప్ తో కనెక్ట్ చేస్తే సరిపుతుంది. అంతే, వెంటనే ఈ AR కళ్ళజోడు తన పని మొదలు పెడుతుంది.
Also Read : iQOO Z9 5G: సొగసైన డిజైన్ తో కొత్త ఫోన్ తెస్తున్న ఐకూ.!
ఈ గ్లాస్ స్క్రీన్ పైన అన్ని వివరాలను కూడా చూపిస్తుంది. ఇందులో, మెసేజ్ నోటిఫికేషన్ లతో మరిన్ని అప్డేట్స్ ను ఇన్స్టాంట్ గా చూపిస్తుంది. అంతేకాదు, ఈ ఒప్పో అగ్యుమెంట్ రియాలిటీ గ్లాస్ వాయిస్ అసిస్టెంట్ తో నేరుగా పని చేస్తుంది. ఈ కళ్లజోడుకు అందించిన ప్రశ్నలకు వెంటనే జవాబులను గ్లాస్ స్క్రీన్ పైన చూపిస్తుంది.
ఇది AndesGPT అని పిలవబడే ఒప్పో యొక్క యొక్క సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పైన నడుస్తుంది. అయితే, ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒప్పో అందించిన ఈ వీడియో చూస్తుంటే, గతంలో ఇంగ్లీష్ ఫిక్షన్ సినిమాలో చూపించిన కొన్ని సినిమాల్లో చూసిన సీన్స్ కళ్ళ ముందు నిజంగా కనిపిస్తున్నట్లు అనిపించింది.