ChatGPT: ప్రపంచాన్ని నివ్వెర పరచిన OpenAI చాట్బాట్ గురించి తెలుసుకోండి.!

ChatGPT: ప్రపంచాన్ని నివ్వెర పరచిన OpenAI చాట్బాట్ గురించి తెలుసుకోండి.!
HIGHLIGHTS

OpenAI hatGPT అని పిలువబడే AI- పవర్డ్ చాట్‌బాట్‌ను విడుదల చేసింది

ఈ చాట్‌బాట్‌ను పరీక్షించడాని పబ్లిక్ యూజర్‌లను అనుమతించింది

కోడింగ్-సంబంధిత సమస్యలను కూడా రెప్పపాటులో పరిష్కరించగలదు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత పరిశోధనా సంస్థ OpenAI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సాధనాలను రూపొందించడంలో దిట్ట. ఇటీవల, ఈ సంస్థ ChatGPT అని పిలువబడే AI- పవర్డ్ చాట్‌బాట్‌ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ చాట్‌బాట్‌ను పరీక్షించడాని పబ్లిక్ యూజర్‌లను అనుమతించింది. ఈ చాట్‌బాట్ వినియోగదారులతో "సంభాషణ ధోరణిలో" మాట్లాడటానికి చక్కగా శిక్షణ పొందిందని, తద్వారా ఇది చాలా మందికి అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ChatGPT కేవలం సెకన్ల వ్యవధిలో యాప్స్ మరియు వెబ్‌సైట్‌ల కోసం కోడ్‌ను వ్రాయడంలో సహాయపడే సాధనంగా ఉపయోగపడుతుందని కూడా క్లెయిమ్ చేయబడింది.

చాలా మంది వినియోగదారులు చాట్‌బాట్‌ను పరీక్షించారు మరియు ఇది సంక్లిష్టమైన కోడింగ్-సంబంధిత సమస్యలను కూడా రెప్పపాటులో పరిష్కరించగలదని తెలుసుకున్నారు. ఈ అనుభవాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

అసలు ఏమిటి ఈ ChatGPT?

ChatGPT అనేది, OpenAI చే అభివృద్ధి చేయబడిన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) మోడల్. ఇది ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత మోడల్, ఇది సంభాషణ డేటా యొక్క లార్జ్ కార్పస్‌ పై శిక్షణ పొందింది. ఇది వినియోగదారు ఇన్‌పుట్‌కు మనుషుల-వంటి ప్రతిస్పందనలను అందించడానికి రూపొందించబడింది. 

ChatGPT ఎలా పని చేస్తుంది?

ChatGPT తో ఉపయోగించడానికి, వినియోగదారులు తప్పనిసరిగా OpenAI వెబ్‌సైట్‌కి వెళ్లి వారి కోసం ఒక అకౌంట్ ను క్రియేట్ చెయ్యాలి. మంచి విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ఈ చాట్‌బాట్‌ ఉచితంగా అందుబాటులో వుంది. ఎందుకంటే పూర్తి స్థాయి సామర్థ్యాలను నిర్ధారించడానికి వీలైనంత ఎక్కువ మంది వినియోగదారులు దీనిని పరీక్షించాలని కంపెనీ కోరుకుంటం, దీనికి దారి తీసింది. ఇక ఇది ఎలా పని చేస్తుందని చాట్‌బాట్‌ని అడిగినప్పుడు, ChatGPT ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి సంభాషణ డేటా యొక్క పెద్ద కార్పస్‌ని ఉపయోగించడం ద్వారా పనిచేస్తుందని తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo