OnePlus 10T ఆగష్టు 3న లాంచ్ అవుతుంది.. ఎలాంటి ఫీచర్లతో వస్తోందంటే ..!!

OnePlus 10T ఆగష్టు 3న లాంచ్ అవుతుంది.. ఎలాంటి ఫీచర్లతో వస్తోందంటే ..!!
HIGHLIGHTS

OnePlus 10T ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది

వన్ ప్లస్ 10T 2022 లో కంపెనీ యొక్క రెండవ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది

OnePlus 10T 5G ఆక్సిజన్ OS 13తో ప్రారంభించబడుతుంది

OnePlus 10T ఆగష్టు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఆగష్టు 3 వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కామేపని ఇప్పటికే వెల్లడించింది. వన్ ప్లస్ 10T 2022 లో కంపెనీ యొక్క రెండవ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. అంతేకాదు, OnePlus 10 Pro మరియు OnePlus 10R తో పాటు వన్ ప్లస్ 10 సిరీస్‌లో చేరనుంది.

వన్ ప్లస్ 10T గురించి కంపెనీ అందించిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 శక్తితో పనిచేస్తుంది. అయితే, ఈ OnePlus 10T లో బ్రాండ్ యొక్క ఐకానిక్ అలర్ట్ స్లైడర్‌ ఉండదని మరియు హాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్ ఉండదని వెల్లడయ్యింది. OnePlus 10T 5G ఆక్సిజన్ OS 13తో ప్రారంభించబడుతుంది. ఈ ఫోన్ ఆగష్టు 3న న్యూయార్క్ నగరంలో విడుదల చేయబడుతుంది.

వన్ ప్లస్ ప్రకారం, OnePlus 10T సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌తో అమర్చబడి ఉంది. అలాగే, OnePlus 10T చూడగానే వన్‌ప్లస్ 10 ప్రో గుర్తుకు చేస్తుంది మరియు పోలి ఉంటుంది. ఈ ఫోన్ కూడా వన్‌ప్లస్ 10 ప్రో యొక్క ఐకానిక్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. OnePlus 10T స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగివుంటుంది. ఇది OIS మరియు EIS సపోర్ట్ కలిగిన ఫ్లాగ్‌షిప్ 50MP సోనీ IMX766 సెన్సార్ ద్వారా అందించబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo