ఇండియాలో ఓలా మరొక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. అదే, Ola S1 Air Electric మరియు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 90Km టాప్ స్పీడ్ తో ప్రయాణించే శక్తిని కలిగి ఉంటుందని ఓలా చెబుతోంది. ఇది మాత్రమే కాదు ఎకో మోడ్‌లో నడిపిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిమీల వరకు నడుస్తుందని కూడా కంపెనీ పేర్కొంది. మరి ఇండియాలో ఓలా కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్, ఫీచర్లు మరియు ధర వివరాలను తెలుసుకుందామా.
ఇండియన్ మార్కెట్ లో OLA సరికొత్తగా విడుదల చేసిన ఈ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ OLA యొక్క కొత్త MoveOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే 7-అంగుళాల టచ్ స్క్రీన్ కన్సోల్‌తో అమర్చబడింది. విశేషం ఏమిటంటే, అవుట్-ఆఫ్-బాక్స్ MoveOS 3 మద్దతుతో వచ్చిన మొదటి స్కూటర్ ఇదే అవుతుంది మరియు నెక్స్ట్ అప్డేట్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రాక్సిమిటీ ఆధారిత అన్‌లాకింగ్ డిజిటల్ కీ షేరింగ్, డాక్యుమెంట్ లను స్టోర్ చేయడంలో సహాయపడే డాక్యుమెంట్ ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి వుంటుందని ఓలా వెల్లడించింది.
ఈ ఓలా స్కూటర్ కేవలం 9.8 సెకన్లలో 0-60 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని ఓలా పేర్కొంది. ఈ స్కూటర్ బ్యాటరీని 0 నుండి 100% వరకూ రీఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్, డిస్క్ బ్రేక్స్ కి బదులుగా డ్రమ్ బ్రేక్‌లు మరియు సింగిల్-పీస్ రియర్ గ్రాబ్ హ్యాండిల్‌తో వస్తుంది.
ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేసిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.84,999. కొనుగోలుదారులు Ola S1 Air Electric ని ప్రీ ఆర్డర్ ద్వారా రూ. 999 చెల్లించి ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్కూటర్ యొక్క డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.