OLA కొత్త స్కూటర్: సింగిల్ ఛార్జ్ తో 141 Km రేంజ్ తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.!

Updated on 19-Aug-2022
HIGHLIGHTS

ఇండియాలో OLA ఎక్కువ దూరం ప్రయాణించగల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ను లాంచ్ చేసింది

ఎక్కవ దూరం ప్రయాణించడం మాత్రమే కాదు 90 km వేగంతో ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది

ఆగస్టు 15 మరియు ఆగస్టు 31 మధ్య రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు

ఓలా ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించగల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ను లాంచ్ చేసింది. ఈ OLA ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఎక్కవ దూరం ప్రయాణించడం మాత్రమే కాదు 90 km వేగంతో ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఓలా యొక్క ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్ మరియు రివర్స్ మోడ్ వంటి Moov OS ఫీచర్‌లను కలిగివుంది. ఈ స్కూటర్ కేవలం ఫీచర్ల పరంగా మాత్రమే కాదు ధర పరంగా కూడా ఆకర్షణీయంగా ఉండేలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్: ధర

ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ తయారీ సంస్థ OLA, ఇండియాలో తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 EV ని రూ.99,999 ధరతో లాంచ్ చేసింది. ఈ కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Pro మాదిరిగానే ఉంటుంది మరియు ఆగస్టు 15 మరియు ఆగస్టు 31 మధ్య రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఎలక్టిక్ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న Ola S1 Ather 450X Simple One TVS iCube మరియు Okinawa Okhi 90 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్:

ఇక ఈ కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 2.98kWh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది గంటకు 90 కి.మీ. గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు, Ola S1 ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 141 KM దూరాన్ని కవర్ చేయగలదని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, కంపానియన్ యాప్ మరియు రివర్స్ మోడ్ వంటి MoovOS ఫీచర్లను కలిగివుంది. అలాగే, Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా S1 Pro యొక్క డిజైన్ చాలావరకు ఒకేలా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :