ఒక గుర్తింపు లేని హ్యాకింగ్ గ్రూప్ ఓలా కేబ్స్ ను హ్యాక్ చేసినట్టు చెప్పింది. కేవలం ఓలా కంపెనీ సెక్యురిటీ సిస్టం లో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియచేయటానికే ఈ పని చేసాము అని చెబుతుంది ఆ హ్యాకింగ్ గ్రూప్.
TeamUnknown పేరు మీద Reddit సైటు లో "ఒక వెబ్ సైటు ని హ్యాక్ చేయడం అంటే, లాటరీ విన్ అయినంత ఆనందం గా ఉంటుంది" అని ఒక పోస్ట్ పెట్టింది. ఓలా కు అదే విషయం పై మెయిల్ చేయగా కంపెని నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పింది ఈ హ్యాకింగ్ గ్రూప్. ఓలా డేటా బేస్ కు సంబందించి మూడు స్క్రీన్ షాట్స్ ను కూడా పోస్ట్ చేసింది హ్యాక్ చేసిన గ్రూప్.
మొదటి స్క్రీన్ షాట్ లో కంపెని ఉద్యోగుల ఫోన్ నంబర్స్ పేరు లు వంటి ఇన్ఫర్మేషన్ ఉంది, రెండవ స్క్రీన్ షాట్ లో కంపెని డేటాబేస్ కు సంబందించిన డేటా ఉండగా, మూడవ స్క్రీన్ షాట్ లో MySQL ద్వారా యూజర్స్ డేటా ను తీసే కోడ్స్ ఉన్నాయి.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఓలా దీనిపై స్పందించింది. ఓలా హ్యాక్ అయింది అనే వార్తలలో వాస్తవం లేదు అని చెప్పింది. సెక్యురిటీ పరంగా ఎటువంటి డేటా లీక్ అవ్వలేదు అని చెబుతుంది ఓలా. హ్యాకింగ్ గ్రూప్ చూపించిన ఇమేజెస్ కూడా డమ్మీ సర్వర్ డిటేల్స్ అని చెప్పింది ఓలా. హ్యాకింగ్ ఎటెంమ్ప్ట్ కూడా జరగలేదు మా డేటా బేస్ పై అని స్ట్రాంగ్ గా చెప్పింది ఓలా కేబ్స్. సో no వర్రీస్.
ఆధారం: Reddit