మీకు తెలుసా! వాట్సాప్ తో PNR స్టేటస్ మరియు ట్రైన్ లైవ్ స్టేటస్ తెలుసుకోవచ్చు?
మేక్ మై ట్రిప్ , IRCTC సంయుక్త భాగస్వామ్యంతో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం ప్రతిఒక్క స్మార్ట్ ఫోన్లో వుండే యాప్ వాట్సాప్ ఇది సులభమైనది మరియు ప్రజాధారణ పొందినది. అయితే, ఇప్పుడు ఈ వాట్సాప్ తో మీ PNR స్టేటస్ మరియు ట్రైన్ రన్నింగ్ స్టేటస్ని కూడా తెలుసుకోవచ్చు. అయితే, మీరు ఇవి తెలుసుకోవడానికి- NTES మరియు IRCTC లాంటి ఇతర సాధనాలు అందుబాటులోనే ఉన్నాయనుకోండి. అయితే మీరు వివరాలు తెలుసుకోవాల్సిన ప్రతిసారి 139 కి కాల్ చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ తో ఇది చాల సులభమైన పద్దతిలో ఉంటుంది. వాట్సాప్ లో ఏ వివరాలను తెలుసుకోవడానికి వాట్సాప్ యొక్క కొత్త వెర్షన్ మీ ఫోన్లో ఉండాల్సి ఉంటుంది మరియు ఇంటర్నెట్ కూడా.
PNR స్టేటస్ తెలుసుకోండి ఇలా :
మొదటగా మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో 'మేక్ మై ట్రిప్ వాట్సాప్ నెంబర్' ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత, మీ PNR స్టేటస్ తెలుసుకోవడం కోసం మేక్ మై ట్రిప్ వాట్సాప్ నెంబర్ కి చాట్ చేయవలసి ఉంటుంది. మీ PNR నంబర్ ని టైపు చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి: మీ PNR నెంబర్ 1234554321 అనుకోండి మీరు PNR 1234554321 అని మెసేజి చేయాల్సి ఉంటుంది. ఈ మెసేజి పంపిన వెంటనే మీకు IRCTC సర్వర్ నుండి మీ PNR స్టేటస్ లభిస్తుంది. మీరుమీ సీట్ కన్ఫర్మేషన్ మరియు వివరాలతో షేర్ చేసుకోవచ్చు .
ట్రైన్ లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా :
పైన తెలిపినవిధంగానే మొదటగా మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో 'మేక్ మై ట్రిప్ వాట్సాప్ నెంబర్' ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాటింగ్ మొదలుపెట్టి కేవలం మీ ట్రైన్ నెంబర్ మెసేజి చేయవల్సివుంటుంది. ఉదాహరణకి : ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ A.P Express (22415) గురించి తెలుసుకోవాలనుకోండి కేవలం 22415 అని మెసేజి చేయాల్సి ఉంటుంది దీనికి ముందు వెనుక ఏమీ రాయకూడదు. ఈ మేసేజి పంపిన వెంటనే మీకు ట్రైన్ స్టేటస్ , వాతావరణం , చివరగా దాటిన స్టేషన్ ,అంతిమ స్టేషన్కి చేరుకునే అంచనా సమయం వంటి వివరాలు అందించబడతాయి. అయితే, ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు డేటా ఫెచ్చింగ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటాయి కాబట్టి వివరాలు పొందడంలో కొంత జాప్యంజరిగే అవకాశం ఉండవచ్చు.