షావోమి ఇప్పుడు భారతదేశంలో Mi LED TV లను ఉత్పత్తి చేయనుంది
ప్రస్తుతం ఇండియా No.1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినటువంటి ఈ సంస్థ, తన టీవీ మాన్యుఫాక్చేరింగ్ ని డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో నిర్మించనుంది, తిరుపతిలో.
డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో నిర్మించిన కొత్త Mi LED TV ఉత్పాదక ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఒక 32 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా, 2019 మొదటి త్రైమాసికానికల్లా నెలకు 100,000 Mi LED TV ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని ,షావోమి చెబుతోంది.
ఈ కొత్త Mi LED టీవీ ఉత్పత్తి కర్మాగారం మి LED స్మార్ట్ టివి 4A 80cm (32 ") మరియు మి LED స్మార్ట్ టివి 4A 180cm (43") తో స్థానిక అసెంబ్లీని ప్రారంభిస్తుంది. ఇటీవలే, IDC(ఇంటెర్నేషనల్ డేటా కార్పొరేషన్) Mi LED TV భారతదేశంలో నంబర్ 1 స్మార్ట్ TV బ్రాండ్ గా ప్రకటించింది (ప్రపంచస్థాయి స్మార్ట్ హోమ్ డివైస్ ట్రాకర్ 2018 Q2 ప్రకారం) .
షావోమి ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి, మను జైన్ మాట్లాడుతూ " మేము చేసిన కమిట్మెంట్ ద్వారా భారతదేశంలో ప్రధానంగా షావోమి యొక్క అద్భుతమైన విజయం సాధించింది మరియు మేము ఆంధ్రప్రదేశ్ మద్దతుతో తదుపరి దశకు చేరుకునేందుకు గర్వపడుతున్నాం. ఒక విజయవంతమైన స్మార్ట్ఫోన్ ప్రయాణం తరువాత, మేము భారతదేశం లో MI LED TV తయారీతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాము. మేము ఇప్పటికే ఇండియాలో నంబర్ వన్ స్మార్ట్ టీవీ బ్రాండ్ గా నిలిచాము. ఇప్పుడు, స్థానిక ఉత్పాదనపై మా దృష్టి పెరగడంతో మేము మా సరఫరాను పెంచుకోవచ్చని మరియు చాలామంచి మి అభిమాన ప్రొడక్ట్స్ అందించగలమని మేము ఆశిస్తున్నాము" అనితెలిపారు.
అనుకున్నట్లుగా అన్ని సవ్యంగా జరిగితే, ప్రస్తుత భారత మార్కెట్లో అధికంగా ఉన్న స్మార్ట్ టివి ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. అలాగే,భారతదేశ ప్రమాణాలతో మనకు ఈ టీవీలు అందే అవకాశలుకూడా ఉండవచ్చు.