ఇప్పుడు మీరు మీ వాట్సాప్ డేటా ని బ్యాక్ అప్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్ స్పేస్ అవసరం లేకుండానే

ఇప్పుడు మీరు మీ వాట్సాప్ డేటా ని బ్యాక్ అప్ చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్ స్పేస్ అవసరం లేకుండానే
HIGHLIGHTS

ఈ సంవత్సరం నవంబర్ 12 నుండి వాట్సాప్ చాట్ మరియు మల్టీమీడియా బ్యాకప్లు అన్ని వినియోగదారులకు ఉచితము మరియు అపరిమితంగా ఉంటుంది.

ఎప్పుడైనా గూగుల్ డ్రైవ్ లో స్టోరేజ్ నిండినది అనే సందేశాలతో నిరుత్సాహపడ్డారా? అయితే ఇప్పుడు మీరు ఈ వార్తతో ఊపిరిపీల్చుకోవచ్చు గూగుల్ మరియు వాట్సాప్ కలసి ఉమ్మడిగా ఒక ఒప్పందానికి వచ్చాయి అది డిస్క్ నిల్వ పరిమితికి  వాట్సాప్ బ్యాకప్ లెక్కించబడదు. సింపుల్ గా చెప్పాలంటే, వాట్సాప్  వినియోగదారులు ఇప్పుడు వారి డిస్క్ ఖాతాలో స్థల క్రంచ్ గురించి ఆందోళన చెందకుండా  చాట్స్ , ఫోటోలు, ఆడియో ఫైళ్లు మరియు వీడియోలతో సహా అపరిమిత డేటాను బ్యాకప్ చేయగలరని దీని అర్థం. గతంలో, గూగుల్ డ్రైవ్ లోని  వాట్సాప్ బ్యాకప్లు చాలా స్థలాన్ని మాయం చేసింది.

మా బృందం సభ్యుల్లో ఒకరికి ఆపాదించబడిన ఒక మెయిల్లో, "గూగుల్ మరియు వాట్సాప్ మధ్య కొత్త ఒప్పందం కారణంగా, వాట్సాప్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్  కోటాకు వ్యతిరేకంగా, లెక్కించబడదు. ఏదేమైనప్పటికీ, సంవత్సరానికి పైగా అప్డేట్ చేయని వాట్సాప్ బ్యాకప్లు స్వయంచాలకంగా నిల్వ నుండి తీసివేయబడతాయి. "ఇది గూగుల్ డ్రైవ్ యాప్ యొక్క వినియోగదారులందరికీ గూగుల్  మెయిల్ను పంపింది.

నవంబరు 12 న అన్ని వినియోగదారులకు ఈ విధానం అమల్లోకి వస్తుంది, కొంతమంది వినియోగదారులు కోటా ప్రయోజనాలను ముందు చూడవచ్చు. ఈ  బ్యాకప్ల నష్టాన్ని నివారించడానికి, గూగుల్  డ్రైవ్ బృందం ఈ తేదీ ముందు వాట్సాప్ మాన్యువల్ గా బ్యాకప్ చేయాలనీ  ప్రజలుకు సిఫార్సు చేసింది. మీ డేటాను మాన్యువల్ బ్యాకప్ చేయడానికి, మీ ఫోన్లో గూగుల్ డ్రైవ్ యాక్టివేట్  చేయబడిందని నిర్ధారించుకోండి. అప్పుడు గూగుల్ డ్రైవ్ లో మీ డేటాను బ్యాకప్ చేయడానికి మెను> సెట్టింగ్లు> చాట్లు> బ్యాకప్ చాట్ చేయండి మరియు బ్యాకప్ చేయి " బటన్లని నొక్కండి.

ఈ చర్య సాధారణంగా వాట్సాప్ లో సందేశాలు మరియు మల్టీమీడియా ఫైళ్ళ లోడ్ పొందుతున్న వారికి లబ్ది చేకూర్చేదిగా ఉంటుంది. మీరు ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు గూగుల్  మీకు 15జీబీ  ఉచిత డ్రైవ్ స్టోరేజ్ ని అందిస్తుంది. ఇంకా నెలకు రూ. 130 ల చెల్లింపుతో 100జీబీ  స్థలాన్ని మరియు నెలకు 650 రూపాయలకు కి 1TB  కూడా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.  

వాట్సాప్  మొత్తంగా 1.5 బిలియన్ వినియోగదారులను కలిగివుంది. ఇందులో 200 మిలియన్ వినియోగ దారులను భారతదేశం నుండి కలిగివుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo