దోషం కారణంగా Instagram అనుకోకుండా కొంతమంది వినియోగదారుల పాస్వర్డులను వెల్లడించింది: రిపోర్ట్

దోషం కారణంగా Instagram  అనుకోకుండా కొంతమంది వినియోగదారుల పాస్వర్డులను వెల్లడించింది: రిపోర్ట్
HIGHLIGHTS

Instagram లోని "మీ డేటాను డౌన్లోడ్ చేయి" సాధనంలో ఒక దోషం సాధారణ టెక్స్ట్ రూపంలో కొంతమంది వినియోగదారుల పాస్వర్డులను ప్రదర్శించిందని తెలుస్తోంది.

Facebook యొక్క పూర్తి డేటా దోషాలు మరియు ఉల్లంఘనల నుండి విరామం పొందినట్లు కనిపించడంలేదు. అయితే, ఇపుడు దాని Instagram కూడా సున్నితమైన యూజర్ డేటాను బయటకు లీక్ తెలియజేసినందుకు, ఈసారి భరించలేదని అసహనానికి గురిచేసింది. ది రిజిష్టర్ చేసిన నివేదిక ప్రకారం, తమ డేటా యొక్క ఒక కాపీని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లాట్ఫారములోని "మీ డేటాను డౌన్లోడ్ చేయి" ఎంపికను ఉపయోగించినప్పుడు Instagram కొంతమంది వినియోగదారుల ఖాతా పాస్వర్డుని కూడా సాధారణ టెక్స్ట్ రూపంలో బహిర్గతం చేసింది. ఈ లీక్ లక్షణానికి, ఒక బగ్ కారణమవుతోందని మరియు దీని ద్వారా ప్రభావితం అయిన వినియోగదారులను మెయిల్ ద్వారా సంప్రదించడం జరుగుతుంది మరియు వారి పాస్వర్డును మార్చమని సూచించడం కూడా జరుగుతుంది.

డేటా లీక్ గురించిన అదనపు వివరాలు, "మీ డేటాను డౌన్లోడ్ చేయి" లక్షణం ఉపయోగించిన వారు URL లో సాధారణ టెక్స్ట్ రూపంలో, వారి పాస్వర్డ్లను చూపించినట్లు సూచించారు. ఈ నివేదిక ప్రకారం, ఒక అప్డేటుతో పరిష్కరించబడిన బగ్ ద్వారా కొద్దిమంది వినియోగదారులు మాత్రమే దీని ప్రభావానికి లోనయ్యారు. మీరు Instagram నుండి ఒక ఇమెయిలును అందుకున్న బాధితులలో ఒకరయితే, మీరు వెంటనే మీ పాస్ వర్డును మార్చుకొండి, ఇంకా ప్రారంభించకపోతే, ఈ రెండు-కారకాల ప్రమాణీకరణను అమలు చేయాలని మేము మీకు సూచిస్తున్నాము.

ప్లాట్ఫారములో "వ్యూ యాజ్ " ఫీచర్లో దోషం కారణంగా 50 మిలియన్ల వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేసినట్లు ఇటీవలే,  పేస్ బుక్ అంగీకరించింది. ఈ సాధనం వలన వినియోగదారులు తమ సొంత ప్రొఫైలును మరొకరు  వీక్షించడానికి అనుమతిస్తుంది.  హానికరమైన ఉద్దేశ్యంతో ఒక వ్యక్తి ఈ సాధనాన్ని యాక్సెస్ చేస్తే, ఇది ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా మరియు ఇతర వ్యక్తిగత వివరాలతో సహా మీ యొక్క మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేస్తుంది. దీని కారణంగా, ఈ లక్షణాన్ని యాక్సెస్ చేసిన వినియోగదారులను లాగ్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ చేయమని కోరారు. దీని ఫలితంగా పేస్ బుక్, 40 మిలియన్ల ఖాతాలను సైన్డ్ అవుట్ చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo