ఒక కచ్చితమైన ప్రాంతాన్ని తేలికగా గుర్తించడం కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫిచరును రూపొందిస్తోంది
యూజర్లు, వారు సందర్శించిన ప్రదేశం గురించి రివ్యూ వ్రాసేటప్పుడు తగిన హ్యాష్ టాగ్లను ఉపయోగించవచ్చు గూగుల్ మ్యాపులో.
హ్యాష్ ట్యాగ్, గూగుల్ మ్యాప్స్ సైలెంటుగా ఈ కొత్త ఫిచరును తీసుకొచ్చింది, దీని సహాయంతో యూజర్లు సందర్శించిన ఏదైనా ఒక ప్రదేశం, రెస్టారెంట్లు మరియు జూ వంటి వాటి గురించి, గురించి రివ్యూ వ్రాసేటప్పుడు తగిన హ్యాష్ టాగ్లను ఉపయోగించవచ్చు. ఆంటే మీరు వ్రాసే ఒక రివ్యూ అదే ప్రదేశాన్ని సందర్శించాలనుకునే వారికీ సహాయపడుతుందన్నమాట. ఈ ఉపయోగాన్ని గూగుల్ మ్యాప్ వినియోగధారులకి అందించే లక్ష్యంగా ఈ ఫిచరును తీసుకొచ్చింది గూగుల్.
ఉదాహరణకు, మీరు మీకు నచ్చిన ఒక రెస్టారెంట్ గురించి రివ్యూ వ్రాసేటప్పుడు ముందు దానికి #ని జతపరచాలి, #datenight అని వ్రాయాలి. ఇలా వ్రాసిన తరువాత, ఈ హ్యాష్ ట్యాగ్ మీద నొక్కినవారికి ఇలాంటి పేరుతొ అందుబాటులోవున్న అన్ని రెస్టారెంట్లను వారు పరిశీలంచగలుగుతారు.
టెక్ క్రంచ్ యొక్క ఒక రిపోర్టు ప్రకారం, వినియోగదారులు ఒక రివ్యూలో 5 వరకూ హ్యాష్ ట్యాగ్లను జతచేయవచ్చు మరియు దానిని చూడడానికి వీలుగా రివ్యూ చివరలో దానిని జత చేయవల్సివుంటుంది. ఆండ్రాయిడ్ పరికరాల కోసం, ఈ ఫిచరును ఒక వారం క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసినట్లు చెబుతుంది గూగుల్. అలాగే, ఈ ఫిచేరును, కేవలం ఆండ్రాయిడ్ పరికరం మరియు గూగుల్ మ్యాప్స్ యొక్క లోకల్ గైడ్స్ ప్రోగ్రాం సభ్యుల కోసం మాత్రమే విడుదలకి చేసినట్లు వివరించింది. తద్వారా, వారు పొందుపరిచే రివ్యూ, ఫోటోలు మరియు వ్యాపార పరిజ్ఞానం ద్వారా తగిన వాటిని ఎంచుకోవడానికి సులభంగా ఉంటుంది.