Fortnite 7.1.0 అప్డేట్ స్నాప్ డ్రాగన్ 670 మరియు 710 చిప్సెట్లకు మద్దతుని తీసుకువస్తుంది

Updated on 19-Dec-2018
HIGHLIGHTS

సరికొత్త 14 రోజుల ఫోర్ట్ నైట్ ఈవెంటుకు కూడా మద్దతునిస్తుంది.

పురాణగాధల గేమ్ అయినటువంటి, Fortnite ఇప్పుడు ప్రధాన అప్డేటును అందుకోనుంది. ఈ అప్డేట్ సరికొత్త గేమ్ ప్లే ఫిచరును తీసుకువస్తుంది. ఈ Fortnite 7.1.0 అప్డేట్ ఆండ్రాయిడ్, iOS, PC, PS4, Xbox మరియు Nintendo Switch వంటి వాటితో పాటుగా మరికొన్ని ప్లాట్ఫారల పైన అందచేయబడింది. ఈ అప్డేట్,  14 Days Of Fortnite అనే ఒక కొత్త ఈవెంటుని తీసుకువస్తుంది. అంతేకాకుండా, ఒక కొత్త లిమిటెడ్ టైం మోడ్స్ అయినటువంటి – Close Encounters మరియు Food Fight కూడా ఉంటాయి.  Fortnite యొక్క ఈ కొత్త అప్డేట్ ద్వారా, స్నాప్ డ్రాగన్ 670 మరియు స్నాప్ డ్రాగన్ 710 డివైజ్లలో కూడా దీనిని ఆడేలా వీలుకాల్పిస్తుంది.

ఈ  14 Days Of Fortnite ఈవెంట్ డిసెంబర్ 19వ తేది 9AM ET ( ఇండియాలో 7:30PM) సమయం నుండి మొదలవుంటుంది మరియు జనవరి 2 వ తేదీన ముగుస్తుంది. ఈ ఈవెంట్ సమయంలో,  ఈ అప్డేట్ ప్యాచ్ నోట్  పెద్ద మోడ్స్ ప్రతి రెండు రోజులకొకసారి మార్చబడతాయి మరియు చిన్న మోడ్స్ ప్రతీ 24 గంటలకు  ఒకసారి మార్చబడతాయి.

ఈ కొత్త అప్డేట్ ద్వారా 10.5 అంగుళాలు మరియు 12.5 అంగుళాల iPad Pro లలో 60fps లో నడుస్తుంది ఈ ఫోర్ట్ నైట్. అయితే, తగ్గించిన గ్రాఫిక్స్ ద్వారా ఇది కనిపించిలా చేసారు. అలాగే, సరోకొత్త స్మార్ట్ ఫోన్లయినటువంటి నోకియా 8.1 మరియు ఒప్పో R17 లలో కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు ఇప్పుడు. ఇంకా, స్నాప్ డ్రాగన్ 660- తో వుండే శామ్సంగ్ గేలక్సీ A9 లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

అదనంగా, ఈ అప్డేట్ UI కి  ఏమోట్స్ మరియు డ్రా డిస్టన్స్ వంటి కొన్ని చిన్న చిన్న మార్పులను కూడా తీసుకువస్తుంది. iOS కోసం దీని యొక్క అప్డేట్ పరిమాణం 155.7MB గా ఉంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :