Fortnite 7.1.0 అప్డేట్ స్నాప్ డ్రాగన్ 670 మరియు 710 చిప్సెట్లకు మద్దతుని తీసుకువస్తుంది
సరికొత్త 14 రోజుల ఫోర్ట్ నైట్ ఈవెంటుకు కూడా మద్దతునిస్తుంది.
పురాణగాధల గేమ్ అయినటువంటి, Fortnite ఇప్పుడు ప్రధాన అప్డేటును అందుకోనుంది. ఈ అప్డేట్ సరికొత్త గేమ్ ప్లే ఫిచరును తీసుకువస్తుంది. ఈ Fortnite 7.1.0 అప్డేట్ ఆండ్రాయిడ్, iOS, PC, PS4, Xbox మరియు Nintendo Switch వంటి వాటితో పాటుగా మరికొన్ని ప్లాట్ఫారల పైన అందచేయబడింది. ఈ అప్డేట్, 14 Days Of Fortnite అనే ఒక కొత్త ఈవెంటుని తీసుకువస్తుంది. అంతేకాకుండా, ఒక కొత్త లిమిటెడ్ టైం మోడ్స్ అయినటువంటి – Close Encounters మరియు Food Fight కూడా ఉంటాయి. Fortnite యొక్క ఈ కొత్త అప్డేట్ ద్వారా, స్నాప్ డ్రాగన్ 670 మరియు స్నాప్ డ్రాగన్ 710 డివైజ్లలో కూడా దీనిని ఆడేలా వీలుకాల్పిస్తుంది.
ఈ 14 Days Of Fortnite ఈవెంట్ డిసెంబర్ 19వ తేది 9AM ET ( ఇండియాలో 7:30PM) సమయం నుండి మొదలవుంటుంది మరియు జనవరి 2 వ తేదీన ముగుస్తుంది. ఈ ఈవెంట్ సమయంలో, ఈ అప్డేట్ ప్యాచ్ నోట్ పెద్ద మోడ్స్ ప్రతి రెండు రోజులకొకసారి మార్చబడతాయి మరియు చిన్న మోడ్స్ ప్రతీ 24 గంటలకు ఒకసారి మార్చబడతాయి.
ఈ కొత్త అప్డేట్ ద్వారా 10.5 అంగుళాలు మరియు 12.5 అంగుళాల iPad Pro లలో 60fps లో నడుస్తుంది ఈ ఫోర్ట్ నైట్. అయితే, తగ్గించిన గ్రాఫిక్స్ ద్వారా ఇది కనిపించిలా చేసారు. అలాగే, సరోకొత్త స్మార్ట్ ఫోన్లయినటువంటి నోకియా 8.1 మరియు ఒప్పో R17 లలో కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు ఇప్పుడు. ఇంకా, స్నాప్ డ్రాగన్ 660- తో వుండే శామ్సంగ్ గేలక్సీ A9 లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
అదనంగా, ఈ అప్డేట్ UI కి ఏమోట్స్ మరియు డ్రా డిస్టన్స్ వంటి కొన్ని చిన్న చిన్న మార్పులను కూడా తీసుకువస్తుంది. iOS కోసం దీని యొక్క అప్డేట్ పరిమాణం 155.7MB గా ఉంటుంది.