ఆధార్ KYC తో అనుసంధానించిన దాదాపు 50 కోట్ల మొబైల్ కనెక్షన్లను తొలగించే అవకాశం
మొబైల్ నంబర్ యాక్టివేషన్ కోసం ప్రైవేట్ కంపెనీలు ఉపయోగించుకుంటున్న యూనిక్ ఐడెంటిటీని నిలిపివేయాలాన్నిసుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఆధార్ సెక్యూరిటీ పైన్ తలెత్తిన ఇబ్బదుల కారణంగా, ఆధార్ వివరాలతో మొబైల్ కనెక్షన్ తీసుకున్నవారు ఇప్పుడు కొత్త KYC ని అనుసంధానించవల్సి వస్తుంది. సుమారుగా 50 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఆధార్ KYC తో తీసుకున్నట్లుగా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే దాదాపుగా, భారతదేశంలో సగానికి పైగా మొబైల్ వినియోగదారులు కొత్త KYC అనుసంధానం చేయవలసి ఉంటుంది.
యూనిక్ ఐడెంటిటీని నిలిపివేయాలాన్నిసుప్రీమ్ కోర్టు ఇచ్చన తీర్పు కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, మొత్తం భారతదేశంలో సగానికి పైగా మొబైల్ కనెక్షన్లను ఈ సమస్యవలన తొలగించాల్సి వస్తుండడంతో, దీని పైన చాలా చర్చలతరువాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆధార్ కి బదులుగా, నిర్ణిత సమయం లోపల ఒక కొత్త KYC ని నమోదు చేయవలసి ఉంటుంది.
టెలికామ్ సెక్రటరీ అయిన, అరుణా సుంధరరాజన్ ఈ విషయం పైన మాట్లాడుతూ, "ఈ కొత్త KYC అనుసంధానానికి ఏవిధమైన ఇబ్బంది రాకుండా చూడాలని మరియు ఇది కేవలం యూనిక్ ఐడెంటిటీ సెక్యూరిటీలో భాగంగా చిన్న పరివర్తన మాత్రమే తప్ప మరేవిధమైన ఇబ్బందులు కలగవని ప్రభత్వం ప్రజలకి అర్ధమయ్యేలా తెలియచేయాలని చెప్పారు".
అయితే, ముందుగా ఆధార్ కాకుండా ఇతర KYC నమోదుచేసుకుని తరువాత ఆధార్ ని అప్డేట్ చేసిన వారు కూడా కొత్త KYC ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆధార్ అనుసంధానము చేసిన తరువాత పాత డేటా ని తొలగించవచ్చని అప్పటి తీర్మానము ప్రకారంగా, పాత KYC తొలంగించారు కాబట్టి వారు కూడా కొత్త KYC ఇవ్వాల్సి ఉంటుంది.
కొత్త KYC గా పరిగణించబడేవి: పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటు గుర్తింపు కార్డు(ఓటర్ కార్డు), కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, లేదా PAN కార్డు వంటివాటిని కొత్త KYC గా ఇవ్వవచ్చు.