రోజులు గడిచే కొద్దీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. కేబుల్ సహాయంతో పని చేసే సంప్రదాయ ల్యాండ్ లైన్ ఫోన్ ల నుంచి మొబైల్ ఫోన్లకు మారిపోయాము. అంతటితో ఆగకుండా రియల్ టైం లో ఒకరిని ఒకరు చూసుకుంటూ వీడియో కాల్ టెక్నాలజీకి కూడా చేరుకున్నాము. కానీ, కాలింగ్ సమయంలో కుదించబడిన తరంగాల కారణంగా సాధారణ కాలింగ్ స్థాయిలో మాత్రమే చాలా కాలంగా కొనసాగుతున్నాము. అయితే, ఇప్పుడు నోకియా కొత్త టెక్ తో 3D Calling కూడా అంది పుచ్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఈరోజు కొత్త టెక్నాలజీ తో ‘ఇమ్మర్సివ్ కాలింగ్’ ను నిర్వహించినట్లు నోకియా తెలిపింది. నోకియా ప్రెసిడెంట్ మరియు CEO అయిన పెక్కా లాండ్ మార్క్, ఈ కొత్త టెక్నాలజీ గురించి వివరించారు మరియు ఈ టెక్నాలజీతో కాల్ చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
ఈ కొత్త కాలింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, కొత్త 3GPP ఇమ్మర్సివ్ వాయిస్ మరియు ఆడియో సర్వీస్ (IVAS) Codec ను ఉపయోగించి, సాధారణ మోనోఫోనిక్ టెలిఫోనీ కి బిన్నంగా లైవ్ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని తెలిపారు. దీని గురించి మరింత విస్తారంగా మాట్లాడుతూ, ప్రస్తుతం మనం వినియోగిస్తున్న మోనోఫోనిక్ స్మార్ట్ ఫోన్ వాయిస్ కాల్ ఎక్స్ పీరియన్స్ నుంచి 3D spatial sound తో నిజ జీవిత అనుభవాన్ని అందిస్తుంది ఈ IVAS Codec అని తెలిపారు.
Also Read: ఆన్లైన్ లో లీకైన CMF Phone 1 ఫీచర్స్ మరియు ప్రైస్..!
అప్ కమింగ్ 5G అడ్వాన్సుడ్ స్టాండర్డ్ లో భాగంగా నోకియా చేస్తున్న ప్రయోగాలలో IVAS Codec ఒక ఒకటి అవుతుంది. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, యూజర్లు అద్భుతమైన లైవ్ కాలింగ్ అనుభవాన్ని పొందుతారు. ఈరోజు ఈ కొత్త టెక్నాలజీతో నిర్విఘ్నంగా డెమోన్ట్రేషన్ కాల్ నిర్వహించినట్లు కూడా నోకియా సగర్వంగా తెలిపింది.
అంతేకాదు, ఈ కొత్త టెక్ తో మొదటి కాల్ ని నిర్వహించిన వ్యక్తిగా నోకియా సీఈఓ నిలుస్తారని కూడా తెలిపింది. అయితే, ఈ కొత్త 3D స్పెటియల్ ఇమ్మర్సివ్ కాలింగ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, మనతో మాట్లాడే ఎదుటి వ్యక్తి మన పక్కనే ఉన్నట్లు ఫీల్ కలిగించే లీనమయ్యే కాలింగ్ అనుభవం అందిస్తుంది.