నోకియా స్మార్ట్ వాచ్ ను తయారు చేసింది, కాని మైక్రోసాఫ్ట్ దానిని అడ్డుకుంది.

Updated on 15-Jun-2015
HIGHLIGHTS

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ పేరు మూన్ రేకర్

మూన్ రేకర్ పేరు మీద నోకియాను మైక్రోసాఫ్ట్ కొనే సమయంలో నోకియా సంస్థ ఒక స్మార్ట్ వాచ్ పై పనిచేస్తుంది. అయితే మైక్రోసాఫ్ట్ సొంత స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లో విడుదల చేసే ఉద్దేశాలతో ఉన్నందున నోకియా స్మార్ట్ వాచ్ ప్రాజెక్ట్ ను నిలిపివేసింది. ఈ వివరాలు తాజాగా ఒక బ్లాగ్ లో బయట పడ్డాయి.

నోకియా స్మార్ట్ వాచ్ కు సంబంధించిన ఇమేజెస్ కూడా బయటకు లీక్ అయ్యాయి. ఇది ప్రధానంగా నోటిఫికేషన్లు ఇవ్వటానికి తయారు చేయబడింది. అయితే ఈ ప్రాజెక్ట్ ను దాదాపుగా నోకియా పూర్తి చేసింది. లీక్ అయిన ఇమేజెస్ కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇమేజెస్ కాదు, ఒరిజినల్ స్మార్ట్ వాచ్ ఇమేజెస్ అవి. చూడటానికి చాలా రిచ్ గా ఇమేజెస్ లోనే నోకియా బ్రాండ్ క్వాలిటీ కనిపిస్తుంది.
                        

నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా, ఫోనులో వచ్చిన మెసేజ్ లకు ఇది రిప్లై లు ఇవ్వటం మరియు ఫోటో లను తీసేందుకు ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో.
                        
                        

 

Connect On :