చవక ధరకే LTE ట్యాబ్ లాంచ్ చేసిన Nokia: ధర ఎంతంటే.!

Updated on 15-Oct-2022
HIGHLIGHTS

నోకియా ఇండియాలో మరొక ట్యాబ్ ను విడుదల చేసింది

ఇది LTE ఫీచర్ తో వస్తుంది

ఈ నోకియా ట్యాబ్లెట్ వెనుక 8MP సింగల్ కెమెరాతో వస్తుంది

నోకియా ఇండియాలో మరొక ట్యాబ్ ను విడుదల చేసింది. ఇటీవల రెండు కొత్త ట్యాబ్ లను తీసుకొచ్చిన Nokia T10 సిరీస్ నుండే మరొక కొత్త ట్యాబ్ ను కూడా జత చేసింది. అదే, Nokia T10 LTE  మరియు ఇది LTE ఫీచర్ తో వస్తుంది. అయితే, ముందుగా లాంచ్ చేసిన రెండు ట్యాబ్స్ కూడా Wi-Fi తో పనిచేస్తాయి. ఈ సరికొత్త  నోకియా ట్యాబ్లెట్ టి10 LTE ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

Nokia T10 LTE: ధర

 నోకియా టి10 LTE ట్యాబ్లెట్ ను రెండు వేరియంట్ లలో నోకియా పరిచయం చేసింది. ఇందులో స్టార్టింగ్ వేరియంట్ 3 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.12,799. ఇక రెండవ వేరియంట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ తో రూ.13,999 ధరతో వచ్చింది. ఈ నోకియా ట్యాబ్లెట్ అక్టోబర్ 15 నుండి నోకియా స్టోర్ మరియు e-కామ్ ప్లాట్ఫారం పైన కూడా లభిస్తుంది.    

Nokia T10 LTE: స్పెసిఫికేషన్లు

నోకియా టి10 ట్యాబ్లెట్ 10.36 ఇంచ్ HD డిస్ప్లేని (1280X800 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో కలిగివుంది. ఈ డిస్ప్లే OZO ప్లేబ్యాక్‌కు కూడా మద్దతు కలిగివుంది. ఈ నోకియా టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. నోకియా ప్రకారం, ఇది రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను మరియు మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను అందుకుంటుంది. అంటే, మీరు ఈ టాబ్లెట్‌లో Android 13 మరియు Android 14 కి కూడా మద్దతు పొందుతుంది.

ఇక కెమెరాల పరంగా, ఈ నోకియా ట్యాబ్లెట్ వెనుక 8MP సింగల్ కెమెరాతో వస్తుంది. ముందు వీడియో కాల్ మరియు సెల్ఫీల కోసం AI సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ టాబ్లెట్ 5250mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు స్టీరియో స్పీకర్లు, 3.5mm జాక్ మరియు USB టైప్-సి పోర్ట్‌ లకు మద్దతు ఇస్తుంది. ఈ నోకియా ట్యాబ్లెట్ UNISOC T606 ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 4GB RAM ను జతగా కలిగివుంది.

క్లియర్ గా చెప్పాలంటే, ఈ ట్యాబ్ కూడా ఇటీవల వచ్చిన Nokia T10 స్పెక్స్ మరియు ఫీచర్లనే కలిగి వుంది. అయితే, ఈ ట్యాబ్ లో LTE ఫీచర్ జతచేయబడింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :