పాత మోడల్ కొత్త ఫీచర్స్ కొత్త ఫోన్లు ప్రకటించిన నోకియా..!!

పాత మోడల్ కొత్త ఫీచర్స్ కొత్త ఫోన్లు ప్రకటించిన నోకియా..!!
HIGHLIGHTS

నోకియా ఇటీవల మూడు కొత్త ఫీచర్ ఫోన్లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది

కర్షణీయమైన ఫ్లిప్ మోడల్ నోకియా 2660 ఫ్లిప్

పాత మోడల్ లో కొత్త ఫీచర్లతో వచ్చిన నోకియా 8210 4G ఫీచర్ ఫోన్

నోకియా ఇటీవల మూడు కొత్త ఫీచర్ ఫోన్లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. అవే, Nokia 2660 Flip, Nokia 8210 4G మరియు Nokia 5710 Xpress Audio ఫీచర్ ఫోన్లు. ఆకర్షణీయమైన ఫ్లిప్ మోడల్ నోకియా 2660 ఫ్లిప్ కాగా పాత మోడల్ లో కొత్త ఫీచర్లతో వచ్చిన నోకియా 8210 4G ఫీచర్ ఫోన్. నోకియా ఎక్స్ ప్రెస్ సిరీస్ గురించి తెలియనిది ఎవరికి. అందుకే, ఈ సిరీస్ నుండి నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో ఫోన్ ను ఎన్నడూ చూడని విధంగా వెనుక ఇన్ బిల్ట్ TWS బడ్స్ తో లాంచ్ చేసింది.

నోకియా కొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్ ఫోన్లు ప్రపంచ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ ఫీచర్ ఫోన్ల ధరలు ఈవిధంగా వున్నాయి. Nokia 8210 4G మరియు Nokia 2660 ఫ్లిప్‌లను £64.99 ($59) అంటే దాదాపు రూ. 6000 ధరకు అఫర్ చేసింది. అయితే, Nokia 5710 XpressAudio ను పొందాలంటే మాత్రం £74.99 ($69) (దాదాపు రూ. 7,000 రూపాయలు) ఖర్చు చేయవలసి ఉంటుంది.

నోకియా 2660 ఫ్లిప్:

నోకియా 2660 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ పేరు సూచించినట్లుగా మడతపెట్టేలా ఉంటుంది. ఈ ఫోన్ లో లోపల మరియు వెనుక రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఇది లోపల 2.8-అంగుళాల QVGA డిస్ప్లేని కలిగి ఉంటే వెనుక 1.77-అంగుళాల QQVGA డిస్ప్లేను కలిగివుంది. ఈ ఫోన్ Unisoc T107 ప్రాసెసర్ తో పనిచేస్తుంది మరియు 128MB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1,450mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు ఈ ఫోన్ లో కెమెరా, వైర్లెస్ FM , VGA కెమెరా కూడా వున్నాయి.

నోకియా 8210 4G:

ఇరవై సంవత్సరాల క్రితం నోకియా అందించిన నోకియా 8210 ఫోన్ యొక్క 4G వెర్షన్ ఈ నోకియా 8210 4G మరియు దీని డిజైన్ లో కూడా ఎటువంటి మార్పును చెయ్యలేదు. అయితే, ఫోన్ లోపల మాత్రం కొత్త ఫీచర్లతో అప్గ్రేడ్ చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ తో వస్తుంది మరియు LTE కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 1,450mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ VGA కెమెరా, 128MB అంతర్నిర్మిత స్టోరేజ్, FM రేడియో మరియు MP3 ప్లేయర్ వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది.

 నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో:

ఇక చివరిగా మూడవ ఫోన్ అయిన నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా ప్రత్యేకమైన డిజైన్ తో ప్రవేశపెట్టబడింది. మనం ఎన్నడూ చూడని విదంగా ఈ ఫోన్ వెనుక అంతర్నిర్మిత TWS ఇయర్‌ బడ్స్ కోసం వెనుకవైపు స్లైడర్‌ కలిగిన చక్కని డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ VGA రియర్ కెమెరాను కలిగి వుంది మరియు 1,450 mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T107 SoC ని S30+ UI తో కలిగి ఉంటుంది మరియు డ్యూయల్-సిమ్ కార్డ్‌ లకు కూడా మద్దతు ఇస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo