Noise Two: 50 గంటల పనిచేసే సామర్ధ్యంతో కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ లాంచ్.!

Updated on 09-Nov-2022
HIGHLIGHTS

50 గంటల పనిచేసే సామర్ధ్యంతో కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ లాంచ్

నోయిస్ లేటెస్ట్ గా తీసుకువచ్చిన Noise Two వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్

అంతరాయం లేని కనెక్టివిటీ కోసం BT 5.3 వెర్షన్ తో వుంటుంది

Noise: 50 గంటల పనిచేసే సామర్ధ్యంతో కొత్త వైర్ లెస్ హెడ్ ఫోన్ లాంచ్ చేసింది. ప్రముఖ స్వదేశీ బ్రాండ్ అయిన నోయిస్ అధిక సామర్ధ్యంతో ఎక్కువ సమయం పనిచేసే వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్‌ 'Noise Two' ని ఇండియాలో విడుదల చేసింది. నోయిస్ లేటెస్ట్ గా తీసుకువచ్చిన ఈ నోయిస్ టూ వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్ అంతరాయం లేని కనెక్టివిటీ కోసం BT 5.3 వెర్షన్ తో వుంటుంది. మార్కెట్ లో కొత్తగా అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ నోయిస్ హెడ్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.

Noise Two: ధర

నోయిస్ టూ వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్ ను కంపెనీ రూ.1,499 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ హెడ్ ఫోన్ బోల్డ్ బ్లాక్, కామ్ వైట్ మరియు సెరేన్ బ్లూ మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ ఈరోజు నుండి కంపెనీ అధికారిక సైట్ మరియు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ లలో కూడా లభిస్తుంది. Buy From Here

Noise Two: ఫీచర్స్

ఇక ఈ నోయిస్ టూ వైర్ లెస్ బ్లూ టూత్ హెడ్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయల్ పెయిరింగ్‌తో వస్తుంది మరియు సీమ్ లెస్ కనక్టిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్ తో గొప్ప కనెక్టివిటీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్, AUX, SD కార్డ్ మరియు FM తో సహా నాలుగు ప్లే మోడ్‌లు కలిగి వుంది. అలాగే, IPX5 వాటర్ రెసిస్టెన్స్‌ తో దుమ్ము మరియు నీటి నుండి రక్షణను కూడా కలిగివుంది. ఈ హెడ్ ఫోన్ True Bass TM గొప్ప బాస్ అనుభూతిని అందిస్తుంది మరియు 40mm స్పీకర్లతో రిచ్ బాస్ అందిస్తుందని నోయిస్ పేర్కొంది. హెడ్ ఫోన్ లో అంతర్నిర్మితంగా అందించిన మైక్ ద్వారా కాలింగ్ సౌలబ్యాన్ని కూడా పొందుతారు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :