WhatsApp User Safety కోసం ఈ కొత్త ఫీచర్ ని జత చేసింది.!
WhatsApp కొత్త ఫీచర్ తెచ్చింది
యూజర్ ప్రైవసీ కోసం వాట్సాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది
ప్రొఫైల్ ఫోటో ను డౌన్ లోడ్ చేసుకువడానికి వీలులేకుండా వాట్సప్ లాక్ చేస్తుంది
WhatsApp User Safety కోసం ఈ కొత్త ఫీచర్ ని జత చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమైన యూజర్ బేస్ ను కలిగిన ఉన్న ఈ మెసేజింగ్ యాప్ కొత్త ఫీచర్ తెచ్చింది. యూజర్ ప్రైవసీ కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వాట్సాప్, ఇప్పుడు ఇందులో భాగంగానే మరొక కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. ఈ ఫీచర్ తో యూజర్ల ప్రొఫైల్ పిక్చర్ ను ఇతరులు స్క్రీన్ షాట్స్ తీసే వీలులేకుండా చేసి యూజర్ సేఫ్టీ మరింత పెంచింది.
ఏమిటా WhatsApp User Safety ఫీచర్?
వాట్సాప్ లో తమ గురుంచి ఇతరులకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లను ఇవ్వడానికి ‘స్టేటస్’ ను ఉపయొసగిస్తుంటారు. అయితే, వాస్తవానికి అంతకంటే ఎక్కువగా ప్రొఫైల్ పిక్చర్, అదేనండి DP (డిస్ప్లే పిక్చర్) గా వాడుక భాషలో ఈ ఫీచర్ ద్వారా తమ కొత్త ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉంటారు.
అయితే, ఈ ప్రొఫైల్ పిక్చర్ ను అందరూ చూడటానికి, గుర్తు పట్టడానికి లేదా ఫీలింగ్ ను తెలియచేయడానికి కూడా ఉపాయగిస్తున్నారు. ఈ ప్రొఫైల్ ఫోటో ను డౌన్ లోడ్ చేసుకువడానికి వీలులేకుండా వాట్సప్ లాక్ చేస్తుంది. అయితే, ప్రొఫైల్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అవకాశం వుంది.
Also Read: Realme Narzo 70 Pro 5G: కొత్త ఎయిర్ జెశ్చర్ మరియు Sony కెమేరాతో వస్తోంది.!
కానీ, ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ లేదా డిస్ప్లే పిక్చర్ (DP) లను స్క్రీన్ షాట్ తీసుకువడానికి వీలు లేకుండా చేసే కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. వాస్తవానికి, ఈ ఫీచర్ ఇప్పటికే చాలా అకౌంట్ లకు అందుబాటులోకి కూడా వచ్చింది. ప్రొఫైల్ ను ఓపెన్ చేసి ప్రొఫైల్ ఇమేజ్ ను స్క్రీన్ షాట్ కోసం ట్రై చేస్తే, దేనికి అనుమతి లేదంటూ స్క్రీన్ పైన నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది.
DP ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ కోసం నొక్కగానే ‘This APP Doesn’t Allow taking screen shot’ అని చూపెడుతుంది. నిజానికి, గత నెలలోనే ఈ ఫీచర్ గురించి కొన్ని రిపోర్ట్స్ వచ్చింది. అయితే, ఈ ఫీచర్ ఇప్పుడు చాలా ఫోన్ లలో పని చేయడం మొదలై పెట్టినట్లు తెలుస్తోంది. మీకు కూడా మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ అందినట్లయితే, ఇక నుండి మీరు ఇతరుల DP ఫోటోలను స్క్రీన్ షాట్ తీసే అవకాశం ఉండదు.